మాస్ మహారాజ రవితేజ ( Ravi Teja ) మరో కొత్త సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చిన విషయం తెలిసిందే.తాజాగా ఈయన టైగర్ నాగేశ్వరరావు ( Tiger Nageswara Rao )బయోపిక్ చేసాడు.
వాల్తేరు వీరయ్య, ధమాకా వంటి బ్లాక్ బస్టర్స్ అందుకుని మరింత ఉత్సాహంగా ఈ సినిమాను పూర్తి చేసి రిలీజ్ కు కూడా చేసాడు.రవితేజ చేసిన లేటెస్ట్ పాన్ ఇండియన్ మూవీ ”టైగర్ నాగేశ్వరరావు”.
నూతన డైరెక్టర్ వంశీ( Director Vamsee ) దర్శకత్వంలో భారీ స్థాయిలో తెరకెక్కిన ఈ సినిమాతో రవితేజ మొదటిసారి పాన్ ఇండియన్ సినిమా చేసాడు.మరి ఈయన ఎలాంటి హిట్ అందుకుంటాడా అని ఫ్యాన్స్ కూడా ఎదురు చూడగా నిన్న గ్రాండ్ గా వరల్డ్ వైడ్ గా రిలీజ్ అయ్యి పాజిటివ్ టాక్ తెచ్చుకుంది.ఈ సినిమాలో రవితేజ సరసన నుపుర్ సనన్, గాయత్రీ భరద్వాజ్( Nupur Sanan, Gayatri Bharadwaj ) హీరోయిన్స్ గా నటించారు.అలాగే జివి ప్రకాష్ కుమార్ స్వరాలు అందించగా అక్టోబర్ 20న రిలీజ్ అవ్వగా రవితేజ నటనకు అంతా ఫిదా అయ్యారు.
ఈయన టైగర్ నాగేశ్వరరావు పాత్రలో జీవించాడు అని ప్రేక్షకుల్లో మంచి టాక్ వచ్చింది.
ఇదిలా ఉండగా ఈ సినిమా ఓటిటి స్ట్రీమింగ్( OTT streaming ) గురించి ఇప్పుడొక న్యూస్ నెట్టింట వైరల్ అయ్యింది.ఈ సినిమా ఓటిటి హక్కులను ప్రముఖ ఓటిటి సంస్థ అమెజాన్ ప్రైమ్ దక్కించుకున్నట్టు తెలుస్తుంది.మరి 8 వారాల తర్వాతనే స్ట్రీమింగ్ అవ్వనుందట.
నవంబర్ చివర్లో కానీ డిసెంబర్ ఫస్ట్ వీక్ లో కానీ స్ట్రీమింగ్ అయ్యే అవకాశం ఉంది.మరి టైగర్ నాగేశ్వరరావు ఈ సెలవులను ఎలా క్యాష్ చేసుకుంటాడో పోటీ ఉన్నప్పటికి ఎలాంటి కలెక్షన్స్ సాదిస్తాడో చూడాలి.