సాయం కోసం వచ్చిన వారే టార్గెట్.. టీడీపీ మాజీ ఎమ్మెల్యే బాగోతం బయటకు..!?

ఏపీలో ప్రతిపక్ష పార్టీగా ఉన్న టీడీపీపై సర్వత్రా విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.తాజాగా ఆ పార్టీ అధినేత చంద్రబాబు స్కిల్ డెవలప్ మెంట్ స్కాం కేసులో ఆరోపణలు ఎదుర్కొంటూ అరెస్ట్ అయి రెగ్యులర్ బెయిల్ రావడంతో బయటకు వచ్చారన్న సంగతి తెలిసిందే.

 Those Who Came For Help Are The Target.. Former Tdp Mla Bagotham Out..!?-TeluguStop.com

అదే తరహాలో ఆ పార్టీలోని కొందరు నేతలు వ్యవహరిస్తున్న తీరుపై ప్రజలు తీవ్రంగా మండిపడుతున్నారు.రాజకీయాల్లో ఉంటూ తప్పుడు పనులు చేస్తున్నారంటూ ధ్వజమెత్తుతున్నారు.

ఇందుకు కారణం టీడీపీకి చెందిన ఓ మాజీ ఎమ్మెల్యే రాసలీలలు బయటకు రావడమే అని తెలుస్తోంది.

ప్రస్తుతం రాష్ట్రంలోని టీడీపీ అంటే పనికి మాలిన రొంపి అని కొందరు ఫీల్ అవుతున్నారని తెలుస్తోంది.

ఆ పార్టీలోని నేతలకు మహిళలపై ఏ మాత్రం గౌరవం ఉండదని చెబుతున్నారు.అంతేందుకు ఆ పార్టీలో పని చేసిన మహిళా నాయకురాళ్లు సైతం అదే విషయాన్ని బహిర్గతంగా చెబుతూ పార్టీని వీడిన సంఘటనలు చాలానే ఉన్నాయి.

సినీనటి కవిత, దివ్యవాణి, వాణి విశ్వనాథ్, యామిని శర్మ … ఇలా పలువురు లీడర్లు మహిళలకు ఆ పార్టీలో గౌరవం లేదని బయటకు వచ్చారన్న సంగతి దాదాపు అందరికీ తెలిసిన విషయమే.అంతేకాకుండా నిన్నటి నిన్న ఓ టీడీపీ ఎంపీ ప్రజా సమస్యల కోసం ఢిల్లీకి వెళ్లానని చెబుతూ అక్కడి పబ్బుల్లో డ్యాన్సులు వేశారంటూ ఓ వార్త హల్ చల్ చేసింది.

ఇప్పుడు తాజాగా టీడీపీ మాజీ ఎమ్మెల్యే సాయం కోసం వచ్చిన మహిళలపై అనుచితంగా ప్రవర్తిస్తూ ఇబ్బంది పెడుతున్నారన్న వార్త బయటకు వచ్చిందని తెలుస్తోంది.రాయలసీమ ప్రాంతానికి చెందిన మాజీ ఎమ్మెల్యే ఫోన్ చాటింగ్ బయటకు రాగా … ఇటువటి రాసలీలలు బయటకు రాకుండా చాలానే ఉన్నాయని ప్రజలు చెబుతున్నారు.

గతంలోనూ అధికారాన్ని అడ్డం పెట్టుకుని పంచాయతీకి వచ్చిన మహిళలను ఇబ్బందులు పెట్టారని తెలుస్తోంది.అంతేకాకుండా డబ్బు ఆశ చూపి లోబరుచుకున్నారని వార్తలు వినిపిస్తున్నాయి.

సాయం కోసం వచ్చిన మహిళలే టార్గెట్ గా రాచకార్యాలు వెలగబెడుతున్నారట.అయితే ఈ వ్యవహారం చుట్టు పక్కల ప్రాంత ప్రజలకు తెలిసినా ఎవరూ బయటపెట్టడం లేదని సమాచారం.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube