ఈ సీజన్ లో బిగ్ బాస్ హౌస్ లో( Bigg Boss ) వచ్చినన్ని ట్విస్టులు, షాకులు ఏ సీజన్ లో కూడా రాలేదు అనడం లో ఎలాంటి అతిశయోక్తి లేదు.‘ఉల్టా పల్టా’ పేరుతో ఆడియన్స్ మైండ్ తో కబడ్డీ ఆడేసుకుంది బిగ్ బాస్ టీం.గత వారం ఎవ్వరూ ఊహించని విధంగా టేస్టీ తేజా( Tasty Teja ) ఎలిమినేట్ అవ్వడం అందరినీ షాక్ కి గురి చేసింది.ఎందుకంటే సోషల్ మీడియా ఓటింగ్ ప్రకారం అందరికంటే తక్కువ ఓట్లను దక్కిచుకున్నది శోభా శెట్టి.
( Shobha Shetty ) కానీ ఆమెని ఉద్దేశపూర్వకంగానే సేఫ్ చేసి, టేస్టీ తేజా ని అన్యాయంగా ఎలిమినేట్ చేసారు అనేది వీక్షకుల వాదన.ఇందులో ఎంత వరకు నిజం ఉందో తెలియదు కానీ, శోభా శెట్టి విషయం లో బిగ్ బాస్ టీం తీవ్రమైన నెగటివిటీ ని మూటగట్టుకుంది.
ఇదంతా పక్కన పెడితే ఈ వారం నామినేషన్స్ లోకి టాప్ కంటెస్టెంట్స్ వచ్చారు.
రతికా ని( Rathika ) పక్కన పెడితే, ఈ వారం నామినేషన్స్ లో ఉన్న మిగిలిన నలుగురు కంటెస్టెంట్స్ హౌస్ లో టాప్ 5 లో కచ్చితంగా ఉంటారు అనుకున్న వారే.శివాజీ, భోలే, గౌతమ్, యావర్ మరియు రతికా నామినేషన్స్ లోకి వచ్చారు.వీరిలో గౌతమ్ మరియు యావర్ డేంజర్ జోన్ లో ఉన్నట్టుగా టాక్ వినిపిస్తుంది.
వీళ్ళిద్దరిలో యావర్( Yawar ) ఎలిమినేట్ అయ్యే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయని అంటున్నారు.గత రెండు మూడు వారాలుగా యావర్ గేమ్ బాగా తగ్గిపోయింది అనే వాదన ఆయన అభిమానుల్లోనూ నెలకొంది.
అందుకు కారణం అతను రతికా మాయలో పడిపోవడం, శివాజీ( Sivaji ) విషయం లో తప్పుగా అర్థం చేసుకోవడం అని అంటున్నారు ఆడియన్స్.రతికా వల్ల యావర్ గేమ్ దెబ్బతినింది కానీ, ఈ వారం నామినేషన్స్ లో మాత్రం రతికా భలే తప్పించుకుంది.
అందుకు కారణం ఆమె కి జరిగిన నామినేషన్ న్యాయం గా లేదని.
ఈ వారం జరిగిన నామినేషన్ ప్రక్రియ లో ప్రియాంక మరియు శోభా శెట్టి తీవ్రమైన నెగటివిటీ ని ఏర్పాటు చేసుకున్నారు.ఆ కారణం వల్లే రతికా దాదాపుగా సేఫ్ అయ్యినట్టే అని అంటున్నారు.కానీ యావర్ లాంటి టాప్ కంటెస్టెంట్ ఎలిమినేట్ అవ్వబోతున్నారు అనే వార్త మాత్రం నెటిజెన్స్ ని బాగా డిస్టర్బ్ చేస్తుంది.
యావర్ మాత్రమే కాదు, గౌతమ్( Gautam ) కూడా ఎలిమినేట్ అయ్యే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయట.ఒక్క శివాజీకి తప్ప మిగిలిన నలుగురు కంటెస్టెంట్స్ కి చాలా చిన్న మార్జిన్ లో ఓట్ల తేడా వచ్చిందట.
అందుకే ఈ వారం ఎలిమినేషన్ ప్రక్రియ చాలా క్లిష్టమైనది అంటూ కామెంట్స్ వినిపిస్తున్నాయి.