రాబోవు కొద్ది నెలల్లో తెలంగాణ ( Telangana ) రాష్ట్రంలో ఎన్నికలు జరగబోతున్నాయి.ఈ క్రమంలో అన్ని పార్టీలు ఎవరికి వారే మేము గెలుస్తామంటే మేము గెలుస్తామని ధీమా వ్యక్తం చేస్తూ ముందుకు కదులుతున్నారు.
మూడు సభలు ఆరు స్పీచ్ లు అనే విధంగా జనాల్లోకి వెళ్తున్నారు.కానీ ఈసారి తెలంగాణ రాష్ట్రంలో రాజకీయాలు చాలా రసవత్తరంగా సాగే అవకాశం కనిపిస్తోంది.
ఎందుకంటే ఈసారి ఎన్నికల్లో బిఆర్ఎస్( BRS ) ,కాంగ్రెస్ పార్టీలతో పాటు బిజెపి బీఎస్పీ పార్టీలు కూడా ఫామ్ లోకి వచ్చాయి.ఇవే కాకుండా ఎర్రజెండా పార్టీలు కూడా బరిలో నిలిచే అవకాశం కనిపిస్తోంది.
గత ఎన్నికల్లో కేవలం కాంగ్రెస్, బిఆర్ఎస్ మధ్య పోటీ ఏర్పడింది.
ఈ క్రమంలో కేసీఆర్ ( KCR )ప్రభుత్వం ఏకధాటిగా సీట్లు కొట్టింది.ఈ అన్ని పార్టీలకు అతీతంగా ఉండే ఎంఐఎం ( MIM ) పార్టీ ఎప్పుడైనా ఓ సైడ్ గా ఉంటుంది.అయితే ఈసారి ఎంఐఎం పార్టీ కీలకం అవ్వనుంది.
అంతేకాకుండా బిజెపి కూడా ఈసారి అసెంబ్లీ సీట్లు ఎక్కువగానే సాధించేటట్టు కనిపిస్తోంది.ఈ క్రమంలో బిఆర్ఎస్ కు సీట్లు తగ్గే అవకాశం ఉంది.
ఈ తరుణంలో అధికార బీఆర్ఎస్ పార్టీ ఎలాగైనా ప్రజల్ని ఆకట్టుకునేందుకు రుణమాఫీ ( Runa mafi ) వంటి పథకాలను అమలు చేసింది.గత రెండు టర్ముల నుంచి రుణమాఫీ కాలేదు.కానీ ఈసారి తప్పకుండా రుణమాఫీ చేస్తామని ప్రకటించి ఇప్పటికే 50 వేలకు మాఫీ చేశారు.అంతేకాకుండా రాబోవు రెండు రోజుల్లో లక్ష రూపాయల వరకు రుణమాఫీ అవుతుందని ప్రభుత్వం ప్రకటన విడుదల చేసింది.
అంతేకాకుండా మరో పది రోజుల్లో లక్ష ఆపై ఉన్న వారికి పంట రుణమాఫీ కాబోతోందని మంత్రి హరీష్ రావు ( Harish rao ) ఒక వేదిక నుంచి తెలియజేశారు.ఒకవేళ ఈ రుణమాఫీ క్లియర్ గా జరిగితే మాత్రం అధికార బీఆర్ఎస్ పార్టీకి అది కలిసి వచ్చే అంశంగా చెప్పవచ్చు.
రైతులు ఎంతో హ్యాపీగా బిఆర్ఎస్ కు మళ్ళీ ఓట్లు వేసే అవకాశం కనిపిస్తుంది.