భద్రాచలం వద్ద మూడో ప్రమాద హెచ్చరిక జారీ..!

ఎగువన కురుస్తున్న భారీ వర్షాలకు భద్రాచలం వద్ద గోదావరి ప్రవాహం పొంగి పోర్లుతోంది.భద్రాచలం వద్ద 53 అడుగులకు ప్రవాహం చేరడంతో మూడో ప్రమాద హెచ్చరికను జారీ చేశారు అధికారులు.

 Telangana, Bhadrachalam, Godavari Floods, Third Alert,-TeluguStop.com

భారీ వర్షాలు కురుస్తుండడంతో భద్రాచలం నుంచి ఏజెన్సీ ప్రాంతాలకు రాకపోకలు నిలిచిపోయాయి.ఇక భద్రాద్రి రామయ్య ఆలయ తూర్పు మెట్ల వరకు నీరు చేరింది.

ఇప్పటికే రామన్న ఆలయ అన్నదాన సత్రం, కల్యాణకట్ట, స్నానఘట్టాలు నీట మునిగాయి.

గోదావరిలో వరద ఉధృతి పెరుగుతుందని కేంద్ర జల సంఘం హెచ్చరికలు జారీ చేసింది.

ఈ రోజు రాత్రి 9 గంటల ప్రాంతంలో ప్రమాద స్థాయి దాటవచ్చని తెలిపింది.దీంతో నది పరివాహక గ్రామాల ప్రజలను అధికారులు అప్రమత్తం చేశారు.

ఈ సందర్భంగా వరద ఉధృతిని మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ సమీక్షిస్తున్నారు.ముంపు గ్రామాల ప్రజలను పునరావాస కేంద్రాలకు తరలిస్తున్నామని మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ తెలిపారు.

పునరావాస కేంద్రాల్లో అవసరమైన అన్ని వసతులు కల్పిస్తున్నట్లు చెప్పుకొచ్చారు.సహాయక చర్యల కోసం రాష్ట్రస్ధాయి కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేశామని అన్నారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube