ఆకలి రుచి ఎరుగదు.నిద్ర సుఖమెరుగదు అంటారు మహానుభావులు.
అది నిజమే.మరి దొంగలకు కూడా చేతులు దురదపెట్టాయంటే దోచుకోవడానికి అగ్గిపుల్ల చాలు.
ఇక లోకంలో పని చేతకాని వారంత దొంగలుగా మారుతున్న విషయం తెలిసిందే.మితిమీరిన ఖర్చులు చేస్తూ, జల్సాలకు అలవాటుపడి వాటికి సరిపడా డబ్బు సంపాధించడం కోసం ఒళ్లు వంచి కష్టపడరు.
కానీ మెదడుకు పదును పెట్టి దొంగతనాలకు ప్రణాళికలు రచిస్తారు.ఈ దొంగలు కూడా ఇలాగే చేశారు.వీరి దొంగతనం గురించి తెలుసుకుంటే.
ఆదిలాబాద్ జిల్లా కేంద్రంలోని కలెక్టరేట్ చౌరస్తాలో ఉన్న ఏటీఎంను చోరులు చోరి చేశారు.
ఆ తర్వాత తీరిగ్గా అందులో ఉన్న క్యాష్ అపహరించి, ఏటీఎం మిషన్‌ను సావర్గమ్ ప్రాంతంలో పడేశారట.ఇంత తెలివి కేవలం అంతర్‌రాష్ట్ర దొంగలకే ఉందని గుర్తించిన పోలీసులు వారి ఆచూకీ కోసం నాలుగు బృందాలుగా ఏర్పడి వెతుకుతున్నారట.
ఇకపోతే మొదట సోనార్ బజార్ ప్రాంతంలో వైష్ణవి జ్యువెలరీలో చోరీ చేయడానికి ప్రయత్నం చేసిన ఈ దొంగల ముఠా, అది కాస్త విఫలం కావడంతో కలెక్టర్ చౌరస్తాలోని ఏటీఎంలో చొరబడ్దారని తెలుస్తుంది.