పవన్ కళ్యాణ్ మూవీతో ఆచార్య సినిమాకు పోలికలు.. ఏంటో తెలిస్తే షాకవ్వాల్సిందే?

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ కెరీర్ లోని బ్లాక్ బస్టర్ హిట్లలో జల్సా సినిమా ఒకటనే సంగతి తెలిసిందే.అల్లు అరవింద్ నిర్మాతగా త్రివిక్రమ్ శ్రీనివాస్ డైరెక్షన్ లో తెరకెక్కిన ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద బ్లాక్ బస్టర్ హిట్ గా నిలిచింది.

 These Are The Similarities Between Acharya And Jalsa Movies Details Here Achary-TeluguStop.com

ఎన్నో ప్రత్యేకతలతో విడుదలైన ఈ సినిమాలో త్రివిక్రమ్ డైలాగ్స్ ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకున్నాయి.ఫుల్ రన్ లో ఈ సినిమా భారీ స్థాయిలో కలెక్షన్లను సాధిస్తోంది.

అయితే ఈ సినిమాకు ఆచార్య సినిమాకు పోలికలు ఉన్నాయని నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు.ఆచార్య సినిమా నక్సలైట్ బ్యాక్ డ్రాప్ లో తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే.

జల్సా సినిమాలో పూర్తిస్థాయిలో కాకపోయినా పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ కొంత సమయం పాటు నక్సలైట్ గా కనిపించడం గమనార్హం.జల్సా సినిమాకు మహేష్ బాబు వాయిస్ ఓవర్ అందించడం ఈ సినిమాకు ప్లస్ అయింది.

Telugu Acharya, Allu Aravind, Chiran Jeevi, Jalsa, Koratala Shiva, Mahesh Babu,

త్రివిక్రమ్ శ్రీనివాస్ కోరిక మేరకు మహేష్ బాబు ఈ సినిమాకు వాయిస్ ఓవర్ అందించడం గమనార్హం.అయితే ఆచార్య సినిమాకు కూడా దర్శకుడు కొరటాల శివ కోరిక మేరకు మహేష్ బాబు వాయిస్ ఓవర్ అందించారు.జల్సా సినిమాకు అల్లు అరవింద్ నిర్మాత కాగా ఆచార్య సినిమా కూడా కొణిదెల ప్రొడక్షన్స్ భాగస్వామ్యంతో తెరకెక్కిన సంగతి తెలిసిందే.జల్సా సినిమా ఏప్రిల్ నెలలోనే రిలీజ్ కాగా ఆచార్య కూడా ఏప్రిల్ నెలలోనే విడుదలవుతోంది.జల్సా సినిమా త్రివిక్రమ్ డైరెక్షన్ లో పవన్ హీరోగా తెరకెక్కిన తొలి మూవీ కాగా చిరంజీవి, చరణ్ సైతం ఆచార్య సినిమాలోనే తొలిసారి కొరటాల శివ డైరెక్షన్ లో నటిస్తున్నారు.135 కోట్ల రూపాయల ప్రీ రిలీజ్ బిజినెస్ చేసిన ఆచార్య బ్లాక్ బస్టర్ హిట్ గా నిలుస్తుందని ఫ్యాన్స్ భావిస్తున్నారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube