రూ. 50వేల లోపు ల్యాప్‌టాప్‌ కొనాలని అనుకుంటున్నారా? బెస్ట్ ప్రొడక్ట్స్ ఇవే!

మీరు రూ.50వేల లోపు కొత్త ల్యాప్‌టాప్ తీసుకోవాలనుకుంటే ఇదే సరైన సమయం అని చెప్పుకోవచ్చు.అయితే మార్కెట్‌లో చాలా బ్రాండ్లు ఉండడంతో మనలో చాలామందికి ఏ బ్రాండ్ ల్యాప్‌టాప్ కొంటే మంచిది, ఏది చెడ్డది అనే సందేహం ఉంటుంది.ఇపుడు మీకు నచ్చిన బ్రాండ్‌లో అద్భుతమైన ఫీచర్లతో ల్యాప్‌టాప్‌లు మనకి మార్కెట్లో అందుబాటులో ఉన్నాయి.

 These Are The Best Laptops Under 50k Available In The Market Details, Best Lapto-TeluguStop.com

మీ కోసమే ఈ సమాచారం.ఈ లిస్టులో మొదటిది “రియల్‌మి బుక్” ల్యాప్‌టాప్.

ఇది ఈ ల్యాప్‌టాప్ ఆపిల్ మాక్ బుక్స్ మాదిరిగానే మినిమలిస్ట్‌గా కనిపిస్తుంది.ల్యాప్‌టాప్ 14-అంగుళాల LCD 2K డిస్‌ప్లేతో గ్రేట్ వ్యూ ఎక్స్‌పీరియన్స్ కూడా అందిస్తుంది.భారత మార్కెట్లో ఈ ల్యాప్‌టాప్ ధర రూ.46,999 నుంచి అందుబాటులో ఉంది.

Telugu Laptops, Asus Vivobook, Budget Laptops, Hp, Infinix Inbook, Realme, Tech,

ఇక మార్కెట్లో వున్న 2వ ఆప్షన్ “అసూస్ వివోబుక్ 15” అదొక బెస్ట్ ఆప్షన్ అని చెప్పుకోవాలి.ఈ ల్యాప్‌టాప్ 15.6-అంగుళాల డిస్ప్లే కలిగి ఉంటుంది.భారత మార్కెట్లో ప్రస్తుత ధర రూ.44,990గా ఉంది.ఫీచర్లను బట్టి ధర పెరిగే అవకాశం గలదు.ఇక ఈ లిస్టులో 3వ ఆప్షన్ “ఇన్ఫినిక్స్ ఇన్ బుక్ X2 ప్లస్.” ఈ ల్యాప్‌టాప్ మార్కెట్‌లో చాలా పాపులర్ బ్రాండ్ కాకపోవచ్చు, కానీ, ఇన్‌ఫినిక్స్ అందించే ప్రొడక్ట్స్ చాలా బావుంటాయి.క్రియేటర్ల కోసం ఈ కంపెనీ కొన్ని మంచి నోట్‌బుక్స్ అందిస్తోంది.ఫీచర్లను బట్టి భారత మార్కెట్లో ఈ ల్యాప్‌టాప్ ధర రూ.47,990 నుంచి అందుబాటులో కలదు.

Telugu Laptops, Asus Vivobook, Budget Laptops, Hp, Infinix Inbook, Realme, Tech,

హెచ్‌పీ కంపెనీ అందించే ల్యాప్‌టాప్ మోడళ్లలో HP 15s ల్యాప్‌టాప్ ఒకటి.ఈ కంపెనీ గురించి ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు.మీకు మంచి ల్యాప్‌టాప్ కావాలంటే Ryzen 5 (5500U)తో కూడిన HP 15s మోడల్ బెస్ట్ ఆప్షన్ అని చెప్పవచ్చు.

HP ల్యాప్‌టాప్‌లను కొనడం వలన ఉపయోగం ఏమంటే సర్వీసు సపోర్టు కూడా అందిస్తుంది.భారత మార్కెట్లో ధర రూ.46,017 నుంచి అందుబాటులో వున్నాయి.ఈ లిస్టులో చివరిది “లెనోవో థిన్ బుక్ 15” ఇది 15.6-అంగుళాల డిస్ప్లేతో వస్తుంది.HP ల్యాప్‌టాప్ మాదిరిగానే Levono కొనుగోలు చేసిన తర్వాత సర్వీసు సపోర్టు కూడా అందుబాటులో ఉంటుంది.భారత మార్కెట్లో ఈ ల్యాప్‌టాప్ ధర రూ.45,990 నుంచి అందుబాటులో ఉంది.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube