రూ. 50వేల లోపు ల్యాప్‌టాప్‌ కొనాలని అనుకుంటున్నారా? బెస్ట్ ప్రొడక్ట్స్ ఇవే!

మీరు రూ.50వేల లోపు కొత్త ల్యాప్‌టాప్ తీసుకోవాలనుకుంటే ఇదే సరైన సమయం అని చెప్పుకోవచ్చు.

అయితే మార్కెట్‌లో చాలా బ్రాండ్లు ఉండడంతో మనలో చాలామందికి ఏ బ్రాండ్ ల్యాప్‌టాప్ కొంటే మంచిది, ఏది చెడ్డది అనే సందేహం ఉంటుంది.

ఇపుడు మీకు నచ్చిన బ్రాండ్‌లో అద్భుతమైన ఫీచర్లతో ల్యాప్‌టాప్‌లు మనకి మార్కెట్లో అందుబాటులో ఉన్నాయి.

మీ కోసమే ఈ సమాచారం.ఈ లిస్టులో మొదటిది "రియల్‌మి బుక్" ల్యాప్‌టాప్.

ఇది ఈ ల్యాప్‌టాప్ ఆపిల్ మాక్ బుక్స్ మాదిరిగానే మినిమలిస్ట్‌గా కనిపిస్తుంది.ల్యాప్‌టాప్ 14-అంగుళాల LCD 2K డిస్‌ప్లేతో గ్రేట్ వ్యూ ఎక్స్‌పీరియన్స్ కూడా అందిస్తుంది.

భారత మార్కెట్లో ఈ ల్యాప్‌టాప్ ధర రూ.46,999 నుంచి అందుబాటులో ఉంది.

"""/" / ఇక మార్కెట్లో వున్న 2వ ఆప్షన్ "అసూస్ వివోబుక్ 15" అదొక బెస్ట్ ఆప్షన్ అని చెప్పుకోవాలి.

ఈ ల్యాప్‌టాప్ 15.6-అంగుళాల డిస్ప్లే కలిగి ఉంటుంది.

భారత మార్కెట్లో ప్రస్తుత ధర రూ.44,990గా ఉంది.

ఫీచర్లను బట్టి ధర పెరిగే అవకాశం గలదు.ఇక ఈ లిస్టులో 3వ ఆప్షన్ "ఇన్ఫినిక్స్ ఇన్ బుక్ X2 ప్లస్.

" ఈ ల్యాప్‌టాప్ మార్కెట్‌లో చాలా పాపులర్ బ్రాండ్ కాకపోవచ్చు, కానీ, ఇన్‌ఫినిక్స్ అందించే ప్రొడక్ట్స్ చాలా బావుంటాయి.

క్రియేటర్ల కోసం ఈ కంపెనీ కొన్ని మంచి నోట్‌బుక్స్ అందిస్తోంది.ఫీచర్లను బట్టి భారత మార్కెట్లో ఈ ల్యాప్‌టాప్ ధర రూ.

47,990 నుంచి అందుబాటులో కలదు. """/" / హెచ్‌పీ కంపెనీ అందించే ల్యాప్‌టాప్ మోడళ్లలో HP 15s ల్యాప్‌టాప్ ఒకటి.

ఈ కంపెనీ గురించి ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు.మీకు మంచి ల్యాప్‌టాప్ కావాలంటే Ryzen 5 (5500U)తో కూడిన HP 15s మోడల్ బెస్ట్ ఆప్షన్ అని చెప్పవచ్చు.

HP ల్యాప్‌టాప్‌లను కొనడం వలన ఉపయోగం ఏమంటే సర్వీసు సపోర్టు కూడా అందిస్తుంది.

భారత మార్కెట్లో ధర రూ.46,017 నుంచి అందుబాటులో వున్నాయి.

ఈ లిస్టులో చివరిది "లెనోవో థిన్ బుక్ 15" ఇది 15.6-అంగుళాల డిస్ప్లేతో వస్తుంది.

HP ల్యాప్‌టాప్ మాదిరిగానే Levono కొనుగోలు చేసిన తర్వాత సర్వీసు సపోర్టు కూడా అందుబాటులో ఉంటుంది.

భారత మార్కెట్లో ఈ ల్యాప్‌టాప్ ధర రూ.45,990 నుంచి అందుబాటులో ఉంది.

హత్రాస్లో 121కి చేరిన మృతుల సంఖ్య.. పరారీలో భోలే బాబా..