జీరో టికెట్‌తో చార్మినార్ వెళ్లిన యువతి.. ఏకిపారేస్తున్న నెటిజన్లు.. ఎందుకంటే..

ప్రస్తుతం మహిళలు, థర్డ్ జెండర్ ప్రయాణికులు ఎలాంటి ఛార్జీలు చెల్లించకుండా తెలంగాణలోని ఆర్టీసీ బస్సుల్లో ప్రయాణాలు చేయవచ్చు.ఎక్స్‌ప్రెస్, పల్లెవెలుగు బస్సుల్లో ఆడవారు, హిజ్రాలు ఫ్రీగా ప్రయాణించేందుకు వీలుగా ‘మహాలక్ష్మి’ ( Maha Lakshmi scheme )అనే ఉచిత బస్సు ప్రయాణ పథకాన్ని కాంగ్రెస్ ప్రభుత్వం( Congress Govt ) ఇటీవల ప్రారంభించింది.

 The Young Lady Who Went To Charminar With Zero Ticket Netizens Are Uniting Beca-TeluguStop.com

ఈ పథకం కర్నాటక, ఢిల్లీ, పంజాబ్, తమిళనాడులో అమలవుతున్న మాదిరిగానే ఉంది.

అయితే, ఈ స్కీమ్ వల్ల ఆటో డ్రైవర్లు చాలా కస్టమర్లను కోల్పోయి ఆదాయం లేక అల్లాడిపోతున్నారు.

మిగతావారు కూడా ఈ స్కీం పట్ల అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు.ఇలాంటి పథకాలు ప్రవేశపెట్టడం, ఆపై ధరలు పెంచి ప్రజలపై భారం పెంచడం ఎంతవరకు కరెక్ట్? అని ప్రశ్నిస్తున్నారు.ఇక ఈ పథకాన్ని దుర్వినియోగం చేస్తున్న మహిళలను కూడా ఏకిపారేస్తున్నారు.

తాజాగా హైదరాబాద్‌కు చెందిన డోనిటా జోస్ అనే మహిళ జీరో బస్ టికెట్( Zero bus ticket ) ఫొటోను సోషల్ మీడియాలో( Social media ) పోస్ట్ చేసింది.చార్మినార్‌కు ఈ జీరో టికెట్ తో ఫ్రీగా ప్రయాణించారని ఆమె తెలిపింది.అయితే అదే ఆమెను వివాదంలో పడేసింది.ఆమె ఈ ఫొటోకు “అందమైన చార్మినార్‌కు నా మొదటి జీరోటికెట్, ఎక్కువ మంది మహిళలు బహిరంగ ప్రదేశాలకు వచ్చి తమ స్వేచ్ఛా జీవితాన్ని ఆస్వాదించండి.” అని క్యాప్షన్ ఇచ్చింది.

ఆర్థికంగా వెనుకబడిన వారి కోసం ఉద్దేశించిన ఈ పథకాన్ని డబ్బులున్న డోనిటా లాంటి మహిళలు వినియోగించడంలో అర్థం ఏముంది? అని కొందరు ఆమెను విమర్శించారు.ఆమె పన్ను చెల్లింపుదారుల సొమ్మును వృధా చేసిందని ఆరోపించారు. స్కీమ్‌ను దుర్వినియోగం చేయవద్దని, ఆర్థిక స్థోమత లేని మహిళలను మాత్రమే ఈ పథకాన్ని ఉపయోగించేలా ధనికులు ప్రవర్తించాలని మరికొందరు కామెంట్స్ చేశారు.ప్రయాణ ఖర్చు మరీ ఎక్కువగా ఉంటే తప్ప ఫ్రీ బస్సు ఉపయోగించవద్దని, ఆటోలు, మిగతా రవాణా వాహనాలను ఎక్కి వారికి కూడా ఉపాధి అందించాలని అన్నారు.

బాగా సంపాదించే వర్కింగ్ ఉమెన్ కూడా బస్సులో సీట్లను ఆక్రమించి ప్రభుత్వ ఆదాయాన్ని తగ్గించవద్దని మరికొందరు కోరారు.అయితే కొందరు యూజర్లు ఈ మహిళకు సపోర్ట్ గా మాట్లాడారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube