మద్యం మత్తులో కొందరు రక్త సంబంధాలను కూడా మర్చిపోతున్నారు.చివరకు కన్న తల్లిదండ్రులను, కట్టుకున్న భార్యను, కన్న బిడ్డల్ని కూడా దారుణంగా హింసిస్తున్నారు.
ఇంకా కొన్ని ఘటనల్లో అయితే చివరకు ప్రాణాలు కూడా తీస్తున్నారు.ఇలాంటివి విన్నప్పుడు అయితే మనిషిలో మానవత్వం ఉందా అంటూ అనిపించక మానదు.
ఊహించడానికి కూడా ఇలాంటి ఘటనలు చాలా బాధాకరంగా అనిపిస్తాయి.అయితే ఇలాంటివి ఎన్ని జరిగినా సరే కొందరు మాత్రం ఇంకా మద్యానికి బానిసై చివరకు కుటుంబాలను చిన్నాభిన్నం చేసుకుంటున్నారు.
అయితే ఇందుకు సంబంధించిన వార్తలు గానీ.వీడియోలు నెట్టింట్లో విపరీతంగా వైరల్ అవుతుంటాయి.అయితే మద్యం అనేది ఒక కుటంబాన్ని ఎంతలా విచ్చిన్నం చేస్తుందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు.కాగా ఇప్పుడు కూడా ఓ వ్యక్తి ఇలాగే మద్యం మత్తులో ఏకంగా కన్న తల్లినే కొట్టి చంపేశాడు.
విశాఖలో ఈ ఘటన చోటుచేసుకుంది.వంతాల పంచాయతీ అడ్డుల గ్రామంలో రామన్నదొర, అర్జులమ్మ జీవిస్తున్నారు.
అయితే వీరి కి ఇద్దరు కొడుకులు ఉండగా.పెద్ద కొడుకు వేరుగా ఉంటున్నాడు.
ఇక చిన్న కొడుకు వారితోనే కలిసి ఉంటున్నాడు.చిన్న కొడుకు మత్స్యలింగం ఆదివారం విపరీతంగా మద్యం తాగి ఇంటికి వచ్చాడు.అయితే అన్నంలోకి కూర లేదని తల్లితో గొడవ పడ్డాడు.ఆవేశంతో తల్లిపై చేయి చేసుకున్నాడు.అయితే తండ్రి పెద్ద కొడుకును తీసుకు వస్తానని చెప్పి వెళ్లాడు.ఇంతలోనే తల్లి మీద గొడ్డలితో దాడి చేశాడు ఆ చిన్న కొడుకు.
దీంతో తీవ్ర రక్త స్రావం అయి ఆ తల్లి అక్కడికక్కడే మృతి చెందింది.దీంతో తండ్రి ఇచ్చిన ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకున్నారు.
నిందితుడిని అదుపులోకి తీసుకున్నారు. కాగా అతని మీద చాలా ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు నెటిజన్లు.