భార్యను కాదని అత్తపై కన్నేసిన అల్లుడు.. మామకు విషయం తెలియడంతో..?

ఇటీవల జరుగుతున్న దారుణాలు చూస్తుంటే గుండె తరుక్కుపోతుంది.మానవత్వం అనే మాటకు సమాజంలో ప్రస్తుతం చోటు కరువైంది.

 The Son-in-law Who Looked At The Aunt And Not The Wife When The Uncle Came To Kn-TeluguStop.com

ఓ వ్యక్తి కట్టుకున్న భార్యను కాదని అత్తపై కన్నేశాడు.కొంతకాలం తరువాత అత్తతో సహజీవనం చేయడం మొదలుపెట్టాడు.

అనుకోకుండా భార్యతో అల్లుడుని ఆ స్థితిలో చూసి ఆవేశంతో భార్యను చంపి అల్లుడిపై దాడి చేశాడు.అయితే అల్లుడు గాయాలతో తప్పించుకున్నాడు.

పోలీసులకు సమాచారం అందడంతో మృతుదేహాన్ని పోస్ట్మార్టం నిమిత్తం ఆసుపత్రికి తరలించి ఆ వ్యక్తిని అరెస్టు చేశారు.అల్లుడు ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నాడు.

అసలు వివరాలు ఏమిటో చూద్దాం.

వివరాల్లోకెళితే.

ఛత్తీస్గడ్ లోని బిలాస్పూర్( Bilaspur ) లో నివాసం ఉండే చందన్ మెష్రామ్, అమ్రికిభాయి( Chandan Meshram, Amrikibhai ) దంపతులకు ముగ్గురు కుమార్తెలు, ఇద్దరు కుమారులు సంతానం.చందన్ వ్యవసాయం చేస్తూ కుటుంబాన్ని పోషించేవాడు.

చందన్ పెద్ద కుమార్తె లలిత కు జునాపరా కు చెందిన సంజు అనే యువకుడితో వివాహం జరిగింది.అయితే అత్త అమ్రికిభాయికు, అల్లుడు సంజుకు మధ్య సాహిత్యం పెరిగి వివాహేతర సంబంధానికి దారితీసింది.

ఈ క్రమంలో బుధవారం మధ్యాహ్నం చందన్ తన పొలానికి వెళ్ళగా అక్కడ అతని భార్య, అల్లుడు సంజు తో అసహ్యకరమైన స్థితిలో కనిపించింది.

Telugu Amrikibhai, Bilaspur, Chandan Meshram, Chhattisgarh, Latest Telugu, Sanju

చందన్ ఒక్కసారిగా ఆగ్రహానికి లోనై పక్కనే ఉన్న గొడ్డలి తీసుకుని భార్య, అల్లుడిపై దాడి చేశాడు.భార్య అక్కడికక్కడే రక్తపు మడుగులోకి జారి ప్రాణాలు విడిచింది.అల్లుడు గాయాలతో బయటపడ్డాడు.

ఈ సంఘటన గ్రామంలో తెలియడంతో గ్రామస్తులంతా అక్కడికి చేరుకొని పోలీసులకు సమాచారం అందించారు.పోలీసులు సంఘటన స్థలానికి చేరుకొని సంజూను చికిత్స నిమిత్తం ఆస్పత్రికి తరలించి, మృతదేహాన్ని పోస్ట్ మార్టానికి తరలించారు.

Telugu Amrikibhai, Bilaspur, Chandan Meshram, Chhattisgarh, Latest Telugu, Sanju

పోలీసులు చందన్ ను విచారించగా తన అల్లుడు సంజు( Sanju ) అంటే తనకు ఇష్టం లేదని, కానీ సంజు తన కూతురిని ప్రేమ వలలో వేసి పెళ్లి చేసుకున్నాడని తెలిపాడు.పెళ్లి తర్వాత సంజు, తన కూతురితో ఉన్న సంబంధాన్ని తెంచుకున్నాడని తెలిపాడు.తన భార్యతో అక్రమ సంబంధం ఉందన్న విషయం బయటపడడంతో ఈ దారుణం చేసినట్లు పోలీసుల ముందు అంగీకరించాడు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube