రీసెంట్ గా భారీ అంచనాల నడుమ పాన్ ఇండియా లెవెల్ లో విడుదలైన చిత్రం ‘లియో’.( LEO ) తమిళ హీరో విజయ్ నటించిన ఈ చిత్రం పై మొదటి నుండి కనీవినీ ఎరుగని రేంజ్ అంచనాలు ఉన్నాయి.
ఆ అంచనాలకు తగ్గట్టు గానే ఈ సినిమా నుండి విడుదలైన ప్రమోషనల్ కంటెంట్ కి మంచి రెస్పాన్స్ వచ్చింది.ప్రపంచవ్యాప్తంగా అన్నీ చోట్ల అడ్వాన్స్ బుకింగ్స్ ( Advance bookings )భారీగా జరిగాయి.
ఈమధ్య కాలం లో ఇలాంటి అడ్వాన్స్ బుకింగ్స్ మరియు క్రేజ్ ఏ సినిమాకి కూడా చూడలేదు ట్రేడ్.కానీ సినిమా విడుదల తర్వాత ఆ అంచనాలను ఏ మాత్రం అందుకోలేకపోయింది ఈ చిత్రం.
ఫస్ట్ హాఫ్ కి బ్లాక్ బస్టర్ రిపోర్ట్ వచ్చింది కానీ, సెకండ్ హాఫ్ లో ఫ్లాష్ బ్యాక్ సన్నివేశాలు బాగా రాలేదని, ఎదో ఊహించి థియేటర్ కి వెళ్లిన ఫ్యాన్స్ మరియు ఆడియన్స్ కి ఆ ఫ్లాష్ బ్యాక్ సన్నివేశం పెద్ద షాక్ ని ఇచ్చింది అంటూ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.
సినిమాలో యాక్షన్ బ్లాక్స్ అన్నీ అదిరిపోయినప్పటికీ, ఈ ఫ్లాష్ బ్యాక్ తెచ్చిన నెగటివ్ టాక్ అంతా ఇంతా కాదని, వెయ్యి కోట్ల రూపాయిలు కొల్లగొట్టేంత సామర్థ్యం ఉన్న ఈ ‘లియో’( LEO ) చిత్రం నేడు 500 కోట్లు కూడా రాబట్టే అవకాశం లేకుండా అయ్యిందని అంటున్నారు.ఇకపోతే ఈ సినిమా ఓటీటీ హక్కులను నెట్ ఫ్లిక్స్ సంస్థ అన్నీ భాషలకు భారీ రేట్స్ ని పెట్టి కొనుగోలు చేసింది.విడుదల తర్వాత 8 వారాలకు ఓటీటీ లో విడుదల చేసుకోవచ్చని అగ్రిమెంట్ చేసుకున్నారు.
కానీ ఇప్పుడు 5 వారాల తర్వాత ఓటీటీ లో విడుదల చేసుకునే అవకాశం ఇస్తే ముందు మాట్లాడుకున్న రేట్ కంటే ఎక్కువ ఇస్తామని నెట్ ఫ్లిక్స్ సంస్థ ఒక ఆఫర్ ఇచ్చిందట.విజయ్ కి ఉన్న క్రేజ్ కారణంగా ఈ సినిమాకి ఒక 10 రోజుల పాటు మంచి షేర్ కలెక్షన్స్ వస్తాయి.
కానీ ఆ తర్వాత లాంగ్ రన్ రావడం కష్టం.
అందుకే ఈ చిత్రాన్ని నవంబర్ 15 వ తారీఖున నెట్ ఫ్లిక్స్ లో విడుదల చేసుకునేందుకు నిర్మాతలు గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్టు తెలుస్తుంది.ఇక పోతే ఈ చిత్రం డివైడ్ టాక్ తో కూడా తెలుగు లో సూపర్ హిట్ రేంజ్ కి చేరుకుంది.ఇక తమిళనాడు లో అయితే వారం రోజుల వరకు అడ్వాన్స్ బుకింగ్స్ ద్వారా హౌస్ ఫుల్స్ అయిపోయాయి.
అక్కడి ట్రేడ్ వర్గాల సమాచారం ప్రకారం ఈ సినిమా వారం లోపే రజినీకాంత్ ‘జైలర్’ మరియు కమల్ హాసన్ ‘విక్రమ్’ ఫుల్ రన్ కలెక్షన్స్ ని దాటేస్తుందని అంటున్నారు.చూడాలి మరి రాబొయ్యే రోజుల్లో ఈ సినిమా ఎంత వరకు ఫుల్ రన్ లో లాగుతుందో అనేది.