గంటల సమయంలోనే ఏర్పడిన చంద్రుడు.. అధ్యయనంలో సంచలన నిజాలు..

ఆకాశంలో చూడముచ్చటగా కనిపించే చంద్రుడు ఎలా ఏర్పడ్డాడో మీకు తెలుసా? నిజానికి శాస్త్రవేత్తలకు కూడా ఈ విషయంలో క్లారిటీ లేదు.ఇప్పటికీ వారి ఊహ ఏంటంటే.4.5 బిలియన్ ఏళ్ల క్రితం భూమి, మార్స్-సైజ్ ఉన్న థియా అని పిలిచే ఒక ఆబ్జెక్ట్ ఢీకొనడం ద్వారా బాహ్య అంతరిక్షంలోకి శిధిలాలు వెళ్ళిపోయాయి.వాటి నుంచే చంద్రుడు ఏర్పడినట్లు శాస్త్రవేత్తలు చాలా కాలంగా ఊహిస్తున్నారు.ఈ నేపథ్యంలోనే సూపర్ కంప్యూటర్ ద్వారా హై-రిజల్యూషన్ అనుకరణ సాయంతో కొందరు పరిశోధకులు సంచలన నిజాలు తెలుసుకున్నారు.

 The Moon Was Formed Within Hours Sensational Facts In The Study , Moon, Natural-TeluguStop.com

అదేంటంటే, చంద్రుడు గంటల వ్యవధిలోనే ఏర్పడ్డాడట.

యూకేలోని డర్హామ్ యూనివర్సిటీకి చెందిన పరిశోధకుల బృందం వారి పరిశోధనలను జర్నల్ ది ఆస్ట్రోఫిజికల్ జర్నల్ లెటర్స్‌లో ప్రచురించింది.

ఇప్పటివరకు ఏ పరిశోధనలు కూడా చంద్రుడు ఎలా ఏర్పడాడనేది కచ్చితంగా తెలపలేదు.శాస్త్రవేత్తల ఊహలకు కూడా ఎలాంటి ఆధారాలు లేవు.

ఎందుకంటే గత కంప్యూటర్ సిమ్యులేషన్స్ భూమి నుంచి ఎక్కువగా చెత్తతో తయారైన చంద్రుడు అలా అస్సలు ఉండడని తేల్చాయి.దీంతో చందమామ ఉనికిలోకి ఎలా వచ్చిందనేది ఎవరూ తెలుసుకోలేని మర్మంగా మారింది.

ఈ నేపథ్యంలోనే శాస్త్రవేత్తలు సూపర్ కంప్యూటర్‌ని ఉపయోగించి 100 మిలియన్ కణాల వరకు అనుకరించడం ద్వారా చంద్రుడు ఏర్పడే విభిన్న దృశ్యాలను పరిశోధించగలిగారు.ఈ సూపర్ కంప్యూటర్‌ని శాస్త్రవేత్తలు కాస్మా అని పిలుస్తున్నారు.

ఎందుకంటే ఇది కాస్మోలజీ మెషిన్‌గా పనిచేస్తుంది.ఈ సూపర్ కంప్యూటర్‌ 100 మిలియన్ కణాల సిమ్యులేషన్స్‌తో చంద్రుడిని పోలిన ఒక విజువల్ రిప్రజెంటేషన్ ఏర్పాటు చేసింది.

ఈ రిప్రజెంటేషన్ చంద్రుడికి సంబంధించిన దృశ్యాలను హై రిజల్యూషన్‌లో చూపించింది.

భూమి-థియా ఢీకొన్న తర్వాత చంద్రుడు కేవలం కొన్ని గంటల్లోనే ఏర్పడినట్లు శాస్త్రవేత్తలు ఈ అనుకరణ ద్వారా కనుగొన్నారు.“భూమి ఏకైక సహజ ఉపగ్రహం చంద్రుడు ఎలా వచ్చాడనే దాని గురించి మనం ఎంత ఎక్కువ నేర్చుకుంటే, మన సొంత భూమి పరిణామం గురించి మనం అంత ఎక్కువగా కనుగొంటాం” అని ఒక శాస్త్రవేత్త పేర్కొన్నారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube