ఈ మధ్య జరుగుతున్న దారుణాలు చూస్తుంటే అసలు వీరు మనుషులేనా అనిపించక మానదేమో.ఎందుకంటే అత్యంత రద్దీగా ఉండే ప్రాంతాల్లో కూడా దారుణాలు చోటుచేసుకుంటున్నాయి.
రీసెంట్గ ఓ కానిస్టేబుల్ ను పార్టీకి అని పిలిచి సామూహిక అత్యాచారానికి పాల్పడిన ఘటన ఎంత సంచలనం రేపిందో అందరికీ తెలిసిందే.ఇక ఆ దారుణం మరువక ముందే ఇప్పుడు మధ్యప్రదేశ్ రాష్ట్రంలో మరో మహిళా పోలీస్ అధికారిణిపై జరిగిన దారుణం అందరినీ కలిచి వేస్తోంది.
ఆమెను వేధించిన ఘటనకు సంబంధించిన న్యూస్ ఇప్పుడు వెలుగులోకి రావడం సంచలనం రేపుతోంది.
వివరాల్లోకి వెళ్తే ఆమె దగ్గర డ్రైవర్ గా పనిచేస్తున్న వ్యక్తి ఏకంగా తను నివసిస్తున్న ఇంట్లోనే దారుణం చేశాడు.
అదేంటంటే ఆమె బాత్రూమ్‌లో ఆమెకే తెలియకుండా సీక్రెట్ గా కెమెరా పెట్టి ఆమె వీడియోలను రికార్డు చేశాడు.ఇక ఆ వీడియోలను చూపించి రూ.5 లక్షలు ఇవ్వాలంటూ బ్లాక్ మెయిల్ చేశాడు.అలా ఇస్తేనే వాటిని డిలీట్ చేస్తానని లేదంటే సోషల్ మీడియాలో పెడుతానంటూ బెదిరింపులకు పాల్పడ్డాడు.
దీంతో ఆమె చేసేది లేక తన ఉన్నతాధికారులకు విషయం చెప్పడంతో వారు రంగంలోకి దిగారు.
వెంటనే అతడి కోసం గాలిస్తున్నారు.కాగా ఆ అగంతకుడు ఏర్పడకుండా బాత్రూమ్ తలుపుల మీద వీడియో రికార్డింగ్ ఆన్ చేసి తన సెల్‌ఫోన్ ను కనిపించకుండా ఉంచడంతో ఆమె గమనించలేకపోయింది.అయితే ఓ రోజు ఎప్పటిలాగే స్నానం చేసేందుకు వెళ్లగా తన బాత్రూమ్‌లో ఉండే సెల్‌ఫోన్ ను చూసి వెంటనే బయటకు రాగా విషయం తెలుసుకున్న ఆ కానిస్టేబుల్ అక్కడి నుంచి జంప్ అయిపోయాడు.
ఇక సెల్ ఫోన్ కూడా తీసుకుని పరారయిన ఆ డ్రైవర్ ఫోన్ చేసి డబ్బులు డిమాండ్ చేశాడు.ఇక అతని కోసం పోలీసులు గాలింపు చర్యలు చేపడుతున్నారు.