కేంద్ర ప్రభుత్వం గ్యాస్ ధరలు పెంచి సామాన్యుడి నడ్డి విరిచింది..మంత్రి హరీష్ రావు.

గ్యాస్ ధరలను పెంచిన కేంద్ర ప్రభుత్వం తీరును వ్యతిరేకిస్తూ మేడ్చల్ జిల్లా ఘట్కేసర్ లో నిర్వహించిన నిరసన ప్రదర్శన కార్యక్రమంలో పాల్గొన్న రాష్ట్ర ఆర్థిక వైద్యారోగ్య శాఖ మంత్రి హరీష్ రావు.పేద ప్రజల మీద కేంద్ర ప్రభుత్వం పెద్ద గ్యాస్ బండ వేసింది.

 The Central Government Has Increased The Gas Prices And Broke The Life Of The Co-TeluguStop.com

అడ్డగోలుగా గ్యాస్ ధరలు పెంచి సామాన్యుడి నడ్డి విరిచింది.తరుచూ సిలిండర్ ధర పెంచుతూ వంటింట్లో మంట రేపుతున్నది.డొమెస్టిక్ సిలిండర్ పై రూ.50 చొప్పున, కమర్షియల్ సిలిండర్ పై రూ.350 చొప్పున పెంచడం దారుణమైన చర్య.రెండు లక్షల 14 వేల కోట్ల రూపాయలను యూపీఏ ప్రభుత్వం హయాంలో సబ్సిడీ కింద ఇచ్చారు.బీజేపీ ప్రభుత్వం 40,000 కోట్ల సబ్సిడీ ఇస్తుందంటే ఎంత తగ్గించిందనేది అర్థమవుతుంది.2014 లో బిజెపి అధికారం లోకి వచ్చినప్పుడు ఒక్కో సిలిండర్ మీద 350 సబ్సిడీ ఉండే, క్రమంగా తగ్గిస్తూ ఇప్పుడు సున్నా చేశారు.

దేశంలో వాణిజ్య సిలిండర్‌ ధరలు పెరగడం ఈ ఏడాదిలో ఇది రెండోసారి.నాడు గ్యాస్ ధరలు 400 ఉంటే అప్పటి బిజెపి నేతలు గగ్గోలు పెట్టారు.స్మృతి ఇరానీ గ్యాస్ బండ తో రోడ్ల మీద ధర్నా చేసింది.ఇప్పుడు అదే స్మృతి ఇరాని కేంద్ర మంత్రిగా ఉంది.

బిజెపి ప్రభుత్వం అధికారంలో ఉంది.ఉపాధిహామీ పథకంలో 30 వేల కోట్లు కోత పెట్టిర్రుపిఎం కిసాన్ యోజనలో భారీగా లబ్ధిదారులను తగ్గించారు.

అన్ని సంక్షేమ పథకాలపై కోతలు పెట్టి పేదల నడ్డి విరుస్తున్న బిజెపి ప్రభుత్వానికి బుద్ధి చెప్పాలి.ప్రధానమంత్రి ఎందుకు చాయి పే చర్చ పెడుతున్నారు సిలిండర్ ధరలు పెంచడం వల్ల చాయ్ అమ్ముకునేవారి పై భారం పడ్తలేదా.

చాయి బండి కాడ చర్చ పెట్టండి 400 సిలిండర్ ఈరోజు 1100 చేశామని.ఒకవైపు పెట్రోలు, డీజిల్‌ ధరలను పెంచి సామాన్యుడి ప్రయాణాన్ని భారంగా మార్చిన మోదీ ప్రభుత్వం.మరోవైపు వంటగ్యాస్‌ సిలిండర్ల ధరలను పెంచుతూ జేబులు గుల్ల అయ్యే దుస్థితిని తీసుకొచ్చింది.

2014లో డొమెస్టిక్‌ సిలిండర్‌ ధర రూ.410.50 ఉంటే.తాజా పెంపుతో ఏకంగా రూ.1,155కు చేరింది.తొమ్మిదేండ్లలో కేవలం డొమెస్టిక్‌ సిలిండర్‌ ధరనే రూ.744.50 పెంచింది.అంటే దాదాపు 178 శాతం పెరిగిందన్నమాట.

ఎన్నిక‌లు అయిపోన ప్రతి సారి గ్యాస్ సిలిండ‌ర్ ధ‌ర‌లు పెంచ‌డం అనవాయితీగా మారింది.మేఘాలయ, నాగాలాండ్, త్రిపుర లో ఎన్నికలు అలా అయిపోయాయో లేదో మళ్ళీ ధర పెంచారు.

త్వరలో కర్ణాటక ఎన్నికలు వస్తున్నాయి, అవి అయిపోగానే మళ్ళీ పెంచుతారు.అంటే ఎన్నికల ముందు కల్లబొల్లి మాటలు చెబుతారు ఎన్నికలు కాగానే అడ్డగోలుగా ధరలు పెంచుతారు.

ఎన్నికలు రాగానే 10 పైసలు తగ్గించి ఎన్నికలు అయిపోగానే 100 రూపాయలు పెంచుతున్నాడు మోడీ.బిజెపి పాలనలో ప్రజల తలసరి ఆదాయం డబుల్ కూడా కాలేదు కానీ, సిలిండర్ ధర మాత్రం మూడు రెట్లు పెరిగింది.

అంటే అప్పుడు 100 సంపాదించే వాడు 200 కూడా సంపాదించడం లేదు కానీ, ఖర్చు మాత్రం 300 అయ్యింది.గ్యాస్ సబ్సిడీ తగ్గిస్తూ కేంద్రం ఆ భారాన్ని ప్రజలపై మోపుతున్నది.2019 లో 37,209 కోట్ల సబ్సిడీ ఉంటే, 2023 లో 180 కోట్లకు తగ్గించింది.ఆ సబ్సిడీ కూడా 9 కోట్ల ఉజ్వల స్కీమ్ వారికి మాత్రమే పోతది, మిగతా వాటికి ఎత్తి వేసింది.

అంటే పేదోళ్లను మరింత నిరుపేదగా, మధ్య తరగతి వాళ్ళని పేదలుగా తయారు చేస్తున్నావు.బిజెపి అచ్చే దిన్ అంటే గిట్ల ఉంటది.మీ పాలన అచ్చే దిన్ కాదు, మీ ధరల పెరుగుదల చూసి సామాన్యుడు భయపడి రోజు సచ్చేదిన్ అవుతున్నది.తెలంగాణ ప్రభుత్వం ప్రజలకు సంక్షేమ పథకాల ద్వారా అందిస్తుంటే, సిలిండర్ ధరలు ఫ్రెంచి ప్రజలపై భారమేస్తున్నారు.

బిజెపికి ఆదానితో సంబంధం ఉంది కానీ, ఆమ్ ఆద్మితో సంబంధం లేదని మరోసారి రుజువైంది.బిజెపి అంటే, భారత జనులను పీడించే పార్టీ గల్లి మీటింగ్ కి వచ్చే బిజెపి నాయకులను తరిమికొట్టాలి.

అందుకే పేద ప్రజలను ముంచుతున్న బిజెపిని ప్రజలు ముంచుదామని చూస్తున్నారు.అప్పు చేసి పప్పు కూడు అంటరు, కనీసం మీరు అప్పులు చేసినా, ధరలు పెంచి పేదలకు పప్పు కూడు కూడా దూరం చేశారు.

దేశంలో అక్క చెల్లెలు అందరినీ సబ్సిడీ ఇస్తామని మోసం చేసింది ప్రభుత్వం.పేదలు రైతులు మహిళలు విద్యార్థులు ఉద్యోగులు ఇలా అన్ని వర్గాల ప్రజలను ఇబ్బంది పెడుతున్న బిజెపి పాలనకు చరమగీతం పాడే రోజులు వచ్చాయి

.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube