ప్రపంచంలో చాలామంది పుట్టీ పుట్టగానే ఏదో ఒకటి సాధించాలని కసితో ముందుకు సాగుతారు.అందుకోసం చిన్నప్పటినుండి వారి తల్లిదండ్రుల సహకారంతో వారు కన్న కలలను సహకారం చేసుకుంటారు.
అందుకోసం అహర్నిశలు కష్టపడి చివరికి విజయం సాధిస్తారు.అసలు విషయంలోకి వస్తే… తాజాగా 10 సంవత్సరాల బాలుడు తన రెండు చేతుల వేళ్ళపై ఏకంగా 50 కార్లను పోనిచ్చి రికార్డు సృష్టించాడు.
తమిళనాడు రాష్ట్రంలోని తంజావూరు జిల్లాకు చెందిన ఈ బాలుడు ప్రపంచ రికార్డు లక్ష్యంగా పెట్టుకొని తన రెండు చేతి వేళ్లపై ఏకంగా యాభై కార్లను పోనిచ్చి రికార్డ్ సృష్టించాడు. ఆ పిల్లాడి పేరు నారాయణ మూర్తి.
పట్టుకొట్టై సమీపాన ఉన్న ఉంపళాకొల్లై గ్రామానికి చెందిన వేంబు, రవిచంద్రన్ గారి కుమారుడు ఈ నారాయణ మూర్తి.ఈ బాలుడు ప్రస్తుతం వారి గ్రామంలో ఉన్న ప్రభుత్వ పాఠశాలలో ఐదో తరగతి చదువుతున్నాడు.
అయితే చిన్నప్పుడు నుండి కరాటేలో అతడు చురుగ్గా శిక్షణ తీసుకుంటున్నాడు.
ఈ నేపథ్యంలోనే అతను కరోనా వైరస్ నియంత్రణ అవగాహన కార్యక్రమంలో ప్రపంచ రికార్డు లక్ష్యంతో సాహస విన్యాసాలు చేశాడు.
ముత్తుపేట్టై – పట్టుకోట్టై మధ్య ఉన్న రోడ్డులో ఓ పెట్రోల్ బంకు సమీపంలో వేదికగా జరిగిన కార్యక్రమంలో అతని రెండు చేతుల వేళ్ల పై ఏకంగా 50 కార్లను పోనిచ్చాడు.ఈ కార్యక్రమాన్నిపట్టుకోట్టై డిఎస్పి ప్రారంభించారు.
సాహసంతో కూడిన ఈ పనిని చేసిన బాలుని అనేక మంది ప్రముఖులు అభినందించారు.ఇలాంటి సాహస క్రీడలు చేయాలంటే కచ్చితంగా అందుకు తగిన శిక్షణ తీసుకుంటే మంచిది.
లేకపోతే ఎవరో చేశారని మనకు ఇష్టం వచినట్టు మనం ప్రయత్నిస్తే లేని పోని సమస్యలు కొని తెచ్చుకున్న వాళ్లమవుతాం.కాబట్టి ఏదైనా సాహసం చేసే విధంగా ఉంటే జర జాగ్రత్త సుమా…!
.