ఈ మధ్య కాలంలో కరోనా కేసులతో పాటుగా రోడ్దు ప్రమాదాలు కూడా అధిక సంఖ్యలో జరుగుతున్న విషయాన్ని గమనించే ఉంటారు.అంటే మనిషిని మరణం నిత్యం వెంటాడుతూనే ఉందన్న మాట.
ఇక ఈ ప్రమాదాలకు కారణం నిర్లక్ష్యం అని చెప్పవచ్చూ.ఇది ఏ రూపంలో ఉన్నా ప్రాణాలను మాత్రం తీస్తుంది.
ఇకపోతే త్రిబుల్ రైడింగ్ చాలా ప్రమాదకరం అన్న విషయం తెలిసిందే.ప్రస్తుతం ఇలాగే ఒక బైకు పై ముగ్గురు ప్రయాణించి ప్రమాదంలో చిక్కుకున్నారు.ఆ ఘటన తాలుకూ వివరాలు తెలుసుకుంటే.వికారాబాద్ జిల్లా కొడంగల్ పురపాలక కేంద్రం పరిధిలో, హైదరాబాద్ టూ బీజాపూర్ వెళ్లే అంతరాష్ట్ర రహదారి సమీపంలోని నందిట్యూబ్ ఫ్యాక్టరీ దగ్గర ఈ తెల్లవారు జామున 4గంటల సమయంలో రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది.
కాగా ఈ ప్రమాదంలో ఒకరు మృతిచెందగా, మరో ఇద్దరు తీవ్రంగా గాయపడినట్లుగా సమాచారం.ఇక వేగంగా వెళ్లుతున్న బైకు అదుపుతప్పి టవేరా వాహనాన్ని ఢీ కొట్టడంతో బొంరస్ పేట గ్రామానికి చెందిన గడ్డల బాలు(32) అక్కడికక్కడే మృతి చెందగా ఇతనితో ప్రయాణిస్తున్న కోట్ల యాదయ్యకు, ఆయన తమ్ముడుకు తీవ్ర గాయాలయ్యాయట.
ఇక గాయపడిన పడిన వారిని వెంటనే ఆస్పత్రికి తరలించి వైద్యం అందిస్తుండగా, ప్రమాద సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలికి చేరుకుని వివరాలు సేకరిస్తున్నట్లు సమాచారం.