ఎన్టీఆర్ జిల్లాలోని గొల్లపూడిలో తీవ్ర ఉద్రిక్తత నెలకొంది.ఇబ్రహీంపట్నంలోని డైరెక్టర్ ఆఫ్ మైన్స్ అండ్ జియాలజీ కార్యాలయం ముట్టడికి టీడీపీ నేతలు ప్రయత్నించారు.
ఈ క్రమంలో ఆ పార్టీ నేత దేవినేని ఉమను పోలీసులు అడ్డుకున్నారు.దీంతో పార్టీ శ్రేణులకు, పోలీసులకు మధ్య తీవ్ర వాగ్వివాదం జరిగిందని తెలుస్తోంది.
ఈ క్రమంలోనే దేవినేని పోలీసులు అరెస్ట్ చేశారు.అయితే గొల్లపూడిలో ఇంటి వద్ద బైటాయించిన దేవినేని నిరసన కార్యక్రమం చేపట్టారు.
జగన్ పాలన కారణంగానే ఇసుక సత్యాగ్రహం చేయాల్సిన పరిస్థితి వచ్చిందని దేవినేని మండిపడ్డారు.వినతిపత్రం ఇచ్చేందుకు వెళ్తుంటే ఎందుకు అడ్డుకుంటున్నారని ప్రశ్నించారు.ఏపీ అప్పులు రూ.12 లక్షల కోట్లకు చేరిందన్న ఆయన ఉద్యోగులకు జీతాలు ఇచ్చే పరిస్థితి కూడా లేదని విమర్శించారు.