1.9 దేశాలకు విమాన సర్వీసులు రద్దు చేసిన కువైట్
కొత్త కరోనా వైరస్ విజృంభిస్తున్న నేపథ్యంలో 9 దేశాల కు విమాన సర్వీసులు రద్దు చేస్తూ కువైట్ నిర్ణయం తీసుకుంది.
2.హాంకాంగ్ లో కార్తీక వనమాస పూజలు
హాంకాంగ్ తెలుగు సమాఖ్య ఆధ్వర్యంలో కార్తీక వన పూజలు, వన మహోత్సవం ఘనంగా నిర్వహించారు.
3.ఒమి క్రాన్ తో ప్రపంచం హై అలెర్ట్
ఒమి క్రాన్ వైరస్ తో ప్రపంచ దేశాల్లో హై అలెర్ట్ ప్రకటిస్తున్నారు.అనేక కొత్త కరోనా ఆంక్షలు విధిస్తున్నారు.
4.ఆఫ్రికా దేశాల నుంచి వచ్చే విమానాల్లో కరోనా కేసులు
దక్షిణాఫ్రికా నుంచి వివిధ దేశాలకు వెళుతున్న విమాన ప్రయాణికుల ద్వారా కొత్త కరోనా వైరస్ ఒమి క్రాన్ విస్తరిస్తుండడం ప్రపంచ దేశాలకు ఆందోళన పెంచుతోంది.ఈ నేపథ్యంలోనే ఆఫ్రికా నుంచి వచ్చే విమాన సర్వీసులపై చాలా దేశాలు ఆంక్షలు విధిస్తున్నాయి.
5.కొత్త కరోనా వైరస్ కట్టడికి ఇజ్రాయిల్ చర్యలు
కొత్త కరోనా వైరస్ కేసులు కట్టడికి ఇజ్రాయిల్ చర్యలు ప్రారంభించింది.ఈ నేపథ్యంలో 14 రోజుల పాటు విదేశీయులు ఇజ్రాయెల్ లో అడుగుపెట్టకుండా చర్యలు తీసుకుంటోంది.
6. ఒమి క్రాన్ పై డబ్ల్యూ హెచ్ వో హెచ్చరికలు
కొత్త కరోనా వేరియంట్ ఒమి క్రాన్ ఈ విషయంలో ప్రపంచ దేశాలు చాలా జాగ్రత్తగా ఉండాలని ముఖ్యంగా ఆఫ్రికా దేశాలు ఈ విషయంలో తగిన జాగ్రత్తలు తీసుకోవాలని ప్రపంచ ఆరోగ్య సంస్థ డబ్ల్యూహెచ్ఓ హెచ్చరికలు జారీ చేసింది.
7.ఒమి క్రాన్ ను హైప్ చేయొద్దు
ఒమి క్రాన్ వైరస్ తో పెద్దగా ముప్పు లేదని అనవసరంగా చేయొద్దని ప్రపంచ దేశాలకు దక్షిణాఫ్రికా విజ్ఞప్తి చేస్తోంది.
8.ప్రపంచంలో ఎత్తైన రైల్వే ట్రాక్ నిర్మిస్తున్న భారత్
ప్రపంచంలో ఎత్తైన రైల్వే ట్రాక్ ను భారత్ మణిపూర్ లో నిర్మిస్తోంది.141 మీటర్ల ఎత్తులో దీనిని నిర్మిస్తోంది.
9.ఒమి క్రాన్ వైరస్ కు కరోనా టీకాలు పనిచేస్తాయి
కొత్త కరోనా వేరియంట్ ఒమి క్రాన్ కు కరోనా టీకాలు పనిచేస్తాయి అని దక్షిణాఫ్రికా ప్రకటించింది.