తెలుగు బిగ్బాస్ సీజన్ 4 మరో మూడు రోజుల్లో ముగియబోతుంది.ఇప్పటికే విజేత ఎవరు అనే విషయంలో క్లారిటీ వచ్చేసింది.
మిస్టర్ కూల్ గా పేరు దక్కించుకున్న అభిజిత్ కే ఈ సీజన్ ట్రోఫీ అందబోతున్నట్లుగా అంతా అనుకుంటున్నారు.బిగ్ బాస్ సీజన్ 4 విన్నర్ అయ్యేందుకు ప్రస్తుతం ఉన్న వారిలో ఎక్కువ అర్హత అభిజిత్ కు ఉన్నట్లుగా స్వయంగా బిగ్ బాస్ నోటి నుండి అనధికారికంగా వచ్చింది.
ప్రతి సీజన్ చివరి వారంలో టాప్ 5 కంటెస్టెంట్స్ జర్నీని చూపిస్తూ ఉంటారు.ఆ సందర్బంగా బిగ్ బాస్ కంటెస్టెంట్స్ తో మాట్లాడుతూ ఉంటాడు.
మీ యొక్క ప్రదర్శణ చాలా బాగుంది, మీరు బాగా ఎంటర్ టైన్ చేశారు, మీ వల్ల నా ఇల్లు ఎప్పుడు కూడా సందడిగా ఉంది అంటూ రకరకాలుగా చెప్తాడు.కాని నిన్నటి ఎపిసోడ్లో అభిజిత్ గురించి మాట్లాడిన ఒక మాట గతంలో ఏ తెలుగు సీజన్ లో కూడా ఏ టాప్ 5 కంటెస్టెంట్ తో బిగ్ బాస్ అన్నది లేదు.
ఇంతకు అది ఏంటీ అంటే మీరు బిగ్బాస్ హౌస్ లో ఉండటంను బిగ్ బాస్ గర్వంగా ఫీల్ అవుతున్నాడు.మీ వంటి తెలివైన పరిణితి కలిగిన కంటెస్టెంట్ ఉండటం వల్ల బిగ్ బాస్ గర్విస్తున్నాడు అంటూ వ్యాఖ్యలు చేశారు.
ఒక కంటెస్టెంట్ ను ఇంతగా పైకి లేపడం బిగ్ బాస్ చరిత్రలో ఇదే ప్రథమం అయ్యి ఉంటుంది.ఇప్పటికే అభిజిత్ కు మొత్తం ఓట్లలో 50 నుండి 55 శాతం ఓట్లు వస్తున్నట్లుగా ప్రచారం జరుగుతోంది.ఇలాంటి వ్యాఖ్యలు బిగ్ బాస్ చేయడంతో ఆ ఓట్ల సంఖ్య మరింతగా పెరిగే అవకాశం ఉంది అంటూ ప్రేక్షకులు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.బిగ్ బాస్ హౌస్ లో ఒక సింపుల్ వ్యక్తిగా అభిజిత్ ఎంట్రీ ఇచ్చాడు.
ఆయన ఫిజికల్ టాస్క్ ల్లో ఆశించిన స్థాయిలో రాణించలేక పోయినా కూడా మైండ్ గేమ్ స్పెషలిస్ట్ అనే పేరు మాత్రం దక్కించుకున్నాడు.బిగ్ బాస్ లో డాన్స్ లు యాక్షన్ లు ఓవర్ యాక్షన్ లు చేసి స్ట్రాంగ్ గా ఉండటం కాదు అభిజిత్ వంటి వారు కూడా గేమ్ ను గెలుస్తారు అంటూ నిరూపించారు ప్రేక్షకులు.
అతడు బిగ్ బాస్ ను ఎదిరించినా కూడా బిగ్ బాస్ ఆయన పట్ల అంతటి వ్యాఖ్యలు చేశాడు అంటే ఏ రేంజ్ లో అభిజిత్ క్రేజ్ పెరిగిందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు.బిగ్ బాస్ సీజన్ 4 విన్నర్ ఎవరు అనే విషయం మరింత క్లారిటీ వచ్చేసింది.ఇక తెలియాల్సింది నెం.2 ఎవరు అనేదే.