టాలీవుడ్ ప్రముఖ లేడీ కమెడియన్ పావలా శ్యామల( Comedian Pavala Syamala ) గురించి ప్రత్యేకంగా పరిచయం అక్కర్లేదు.ఒకప్పుడు దాదాపుగా 300 కి పైగా సినిమాలలో నటించి లేడి స్టార్ కమెడియన్( Lady Star Comedian ) గా గుర్తింపు తెచ్చుకుంది పావలా శ్యామల.
స్టార్ హీరోల సినిమాల్లో నటించి అలరించింది.అయితే సినిమాలలో నటించినన్ని రోజులు సెలెబ్రిటీగా ఒక వెలుగు వెలిగింది పావలా శ్యామలా.
ఒకప్పుడు అలా మంచి జీవితాన్ని గడిపిన ఆమె ప్రస్తుతం తినడానికి తిండి లేక ఆకలితో అలమటిస్తోంది.ఇంకా చెప్పాలంటే ఆమె పరిస్థితి ప్రస్తుతం చాలా దారుణంగా ఉందని చెప్పవచ్చు.
ఒకప్పుడు చిరంజీవి, బాలకృష్ణ, వెంకటేష్ నుంచి ఇప్పటి స్టార్స్ ఎన్టీఆర్, గోపిచంద్, నాని సినిమాల్లో కూడా నటించిన పావలా శ్యామల ప్రస్తుతం వృద్ధాశ్రమంలో దీనస్థితిలో ఉందన్న విషయం తెలిసిందే.ఒకప్పుడు నటిగా బిజీ లైఫ్ ని చూసిన పావలా శ్యామల ప్రస్తుతం వయసు సహకరించకపోవడంతో సినిమాల్లో కనిపించడం లేదు.తనతో పాటు తన కూతురి ఆరోగ్యానికి కూడా చికిత్స చేయించుకుంటూ వస్తూ తినడానికి డబ్బులు లేని పరిస్థితి( Financial Problems )కి చేరుకున్నారు.ఆమె పరిస్థితి తెలుసుకున్న పలువురు సినీ తారలు ఆమెకు ఎంతోకొంత సహాయం చేస్తూ వస్తూనే ఉన్నారు.
కాగా ప్రస్తుతం ఆమె నడవలేని స్థితిలోకి వచ్చేసారు.తాజాగా ఈమె ఒక ప్రముఖ టీవీ ఛానల్ లో ప్రసారమయ్యే ఒక ప్రత్యేక షోకి వచ్చారు.ఆ షోలో పావలా శ్యామల మాట్లాడుతూ.అందరి హీరోలతో నటించాను.అన్ని హిట్టు సినిమాల్లో ఉన్నాను.కానీ చివరికి నా బ్రతుకు ఇలా అవుతుందని అనుకోలేదు.
ఇంతటి దుస్థితి వస్తుందని అసలు ఊహించలేదు.నా కష్టాలను చెప్పుకొని మిమ్మల్ని బాధపెట్టాలని మళ్ళీ మీ ముందుకు రాలేదు.
నేను బ్రతికుండి మళ్ళీ మిమ్మల్ని చూస్తానో లేదో అనే భయంతో, ఒకసారి మీకు కనిపించి మీ అభిమానం పొందాలని ఇప్పుడు వచ్చాను అంటూ వ్యాఖ్యానించిన మాటలు అందర్నీ కంటతడి పెట్టించాయి.అందుకు సంబంధించిన వీడియో వైరల్( Viral video ) అవుతుంది.
ఆ వీడియోలు కళ్యాణి మాటలు విన్న అక్కడున్న సెలబ్రిటీలు( Celebrities ) అందరూ కూడా కంటతడి పెట్టుకున్నారు.