తెలంగాణను శత్రుదేశంగా చూస్తున్నారని మంత్రి కేటీఆర్ అన్నారు.సిరిసిల్ల జిల్లాలో పర్యటించిన ఆయన కేంద్రంపై తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు.
బీఆర్ఎస్ ఎమ్మెల్యేలను కొనేందుకు వచ్చిన బీఎల్ సంతోష్ బ్రోకర్ కాదా అని ప్రశ్నించారు.తెలంగాణ పుట్టుకను ప్రధాని మోదీ అవమానించారన్నారు.
అదేవిధంగా బీజేపీ ఎంపీ అరవింద్ ది ఫేక్ డిగ్రీ అని తెలిపారు.గుజరాత్ గులామ్ లకు చెప్పులు మోసే బండి సంజయ్ తెలంగాణలో పుట్టడం దురదృష్టమని తెలిపారు.
లాభాలు ఆదానీకి చందాలు బీజేపీకి కష్టం మనకా అంటూ కీలక వ్యాఖ్యలు చేశారు.దొంగ డబ్బుతో ప్రభుత్వాలను కులుస్తున్నారని విమర్శించారు.
బీజేపీ ఒక్కటే బతికుండాలన్న కేటీఆర్ పార్టీలను చంపాలన్నదే మోడీ ఆలోచన అని ఆరోపణ చేశారు.చందాల కోసం దిగజారుతున్నారని మండిపడ్డారు.
ప్రధాని మోదీ తన దోస్తులకు దోచిపెడుతున్నారన్నారు.రేవంత్ రెడ్డి, బండి సంజయ్ లు జీవితంలో ఒక పరీక్ష అయిన రాశారా అని ప్రశ్నించారు.
గుజరాత్ లో పేపర్ లీకేజీ వ్యవహారంలో మంత్రులు, సీఎం రాజీనామా చేశారా అని అడిగారు.టీఎస్పీఎస్సీ పేపర్ లీకేజ్ వెనుక తాము ఉన్నామని వస్తున్న ఆరోపణలు అవాస్తవమని స్పష్టం చేశారు.