జ్వాల గుత్తా విడాకులు తీసుకోబోతోందా... క్లారిటీ ఇచ్చిన హీరో విష్ణు విశాల్!

కోలీవుడ్ స్టార్ హీరో విష్ణు విశాల్ (Vishnu Vishal) బ్యాడ్మింటన్ క్రీడాకారిని జ్వాల గుత్తా( Jwala Gutta) ప్రేమించుకుని పెళ్లి చేసుకున్న విషయం మనకు తెలిసిందే.ఇలా వీరి వివాహం ఎంతో అంగరంగ వైభవంగా జరిగింది.

 Is Jwala Gutta Going To Divorce Hero Vishnu Vishal Gave Clarity , Vishnu Vishal,-TeluguStop.com

అయితే తాజాగా వీరిద్దరు విడిపోతున్నారనే వార్త సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.ఇలా వీరిద్దరు విడాకులు(Divorce) తీసుకోబోతున్నారు అంటూ వార్తలు వైరల్ కావడానికి కారణం హీరో విష్ణు విషయాలు చేసినటువంటి పోస్ట్ విడాకుల వార్తలకు ఆజ్యం పోసింది.

గత కొద్దిరోజుల క్రితం విష్ణు విశాల్ సోషల్ మీడియా వేదికగా ఒక పోస్ట్ చేస్తూ.నేను ఎన్నో ప్రయత్నాలు చేస్తున్న విఫలమవుతూనే వస్తున్నాను.అయినా పర్వాలేదు నేను దాని నుంచి ఒక గుణపాఠాన్ని నేర్చుకున్నాను.అయినా అది పరాజయం కాదు పూర్తిగా నా తప్పే.అది ఒక మోసపూరిత ద్రోహం అంటూ ఈయన సోషల్ మీడియా వేదికగా ఈ పోస్ట్ చేయడంతో ఇది కాస్త సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.ఈయన తన జీవితంలో మోసపోయారా… అందుకే తన భార్యతో విడాకులు తీసుకోబోతున్నారా అంటూ పెద్ద ఎత్తున వార్తలను సృష్టించారు.

ఇలా ఈ వార్తలు సోషల్ మీడియాలో వైరల్ గా మారడంతో ఎట్టకేలకు ఈ వార్తలపై నటుడు విష్ణు విశాల్ స్పందించారు.ఈ సందర్భంగా ఆయన ఈ విషయం గురించి మాట్లాడుతూ.కొద్ది రోజుల క్రితం నేను చేసినటువంటి ట్వీట్ ను అతి దారుణంగా అర్థం చేసుకున్నారు.నేను నా పర్సనల్ లైఫ్ గురించి అసలు మాట్లాడలేదు కేవలం వృత్తిపరమైన జీవితం గురించి మాత్రమే మాట్లాడుతూ ట్వీట్ చేశాను.

ఇక మా ఇద్దరికీ ఒకరంటే ఒకరికి ఎంతో నమ్మకం.మనం ఎప్పుడైనా ఇతరులకు ఇవ్వగలిగే గొప్ప బహుమతి ఏదైనా ఉంది అంటే అది కేవలం నమ్మకం మాత్రమేనని, అలా చేయడంలో మనం విఫలమైతే మనల్ని మనమే నిందించుకుంటాం.

మన పట్ల మనం మరి అంత కఠినంగా ఉండకూడదని దాని అర్థం అంటూ ఈ సందర్భంగా ఈయన విడాకుల వార్తలు గురించి క్లారిటీ ఇచ్చారు.ఈ విధంగా విష్ణు విశాల్ చేసినటువంటి ట్వీట్ వైరల్ అవుతుంది.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube