ప్రస్తుతం టాలీవుడ్ లో ఒక ఇంట్రెస్టింగ్ చర్చ సాగుతుంది.గతంలో ఒక పాట కోసం భారీ సెట్ వేసి కోట్ల రూపాయలు ఖర్చు పెట్టారు అంటే ఆశ్చర్యపోయి చూసేవాళ్ళు.
కానీ ఇప్పుడా పరిస్థితి లేదు.మేము 10 కోట్లు పెట్టాము అంటే లేదు లేదు మేము 50 కోట్లు పెడుతున్నాము అనే రేంజ్ కి మన టాలీవుడ్ దర్శకులు పెరిగిపోయారు.
ప్రతి హీరో సినిమా ఇప్పుడు ఇలాగే తెరకెక్కుతుంది.చిన్న సినిమాలను పక్కన పెడితే టాలీవుడ్ లో ప్రస్తుతం షూటింగ్ జరుపుకుంటున్న అన్ని సినిమాలు ఒక్కో సీక్వెన్స్ కోసం కోట్ల రూపాయలు ఖర్చు చేస్తున్నారు.
పాటల కోసం ఫైట్స్ కోసం ఇన్ని కోట్లు ఖర్చు పెట్టడం నిజంగా అవసరమా ? కేవలం సినిమా తీస్తే ఆస్తులన్నీ అమ్ముకోవాలా ? అను కొంత మంది ప్రశ్నిస్తున్న ఆ కొత్తదనం గ్రాండియర్ కోసం దర్శకులు తప్పడం లేదు అంటున్నారు.ఎలాగో బిజినెస్ పెరిగింది అదే రేంజ్ లో కలెక్షన్స్ వస్తాయి అంటూ నిర్మాతలు చేత మూడు చెర్ల నీళ్లు తాగిస్తున్నారు దర్శకులు.
మామూలుగా శంకర్(Shankar) సినిమా తీస్తున్నాడు అంటే బడ్జెట్ వందల కోట్లు ఉంటుంది.ఇప్పుడు గేమ్ చేంజర్(Game Changer) సినిమా కోసం కేవలం ఒక్క పాట కోసమే 16 కోట్ల ఖర్చు పెట్టించారు.అలాగే ఒక ఫైట్ కోసం 20 కోట్ల కోట్ల రూపాయలు ఖర్చు పెడుతున్నారు.ఒక్కో సీక్వెన్స్ కోసం ఇలా కోట్లు ఖర్చు పెట్టించడంలో శంకర్ తర్వాతే ఎవరైనా.
పుష్ప సీక్వెన్స్ లో కూడా సుకుమార్ కేవలం గంగమ్మ తల్లి జాతర కోసమే కోట్ల రూపాయల కుమ్మరించారట.ఈ జాతర సీన్ ఇంటర్వెల్ కి ముందు రాబోతుందట.
అందుకే ఏకంగా 50 కోట్ల రూపాయల వరకు ఖర్చు జరిగిందనేది ఈ టాలీవుడ్ లో వినిపిస్తున్న మాట.
కొరటాల శివ , జూనియర్ ఎన్టీఆర్(Koratala Siva, Jr.NTR) కాంబినేషన్ లో వస్తున్న దేవర చిత్రం కూడా ఇంచుమించు ఇలాంటి పరిస్థితులనే ఎదుర్కొంటుంది.కేవలం అమ్మవారి పాట కోసం 20 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టారట.గతంలో కొరటాల శివ ఆచార్య సెట్టు కోసం 23 కోట్ల రూపాయలను ఇలాగే ఖర్చు పెట్టారు.
ఆ సినిమా బాగా ఆడలేదు కానీ పాద ఘట్టం సెట్టు మాత్రం సినిమాకే హైలైట్ అని చెప్పుకోవచ్చు.కల్కి సినిమాలో కూడా అన్ని కాస్ట్లీ సీన్స్ ఉండబోతున్నాయట.
కేవలం నాగ్ అశ్విన్ పై ఉన్న నమ్మకంతో వైజయంతి మూవీస్ ఒక రూపాయి కూడా వెనకడుగు వేయకుండా కోట్ల రూపాయల డబ్బును కుమ్మరిస్తున్నారట.చిరంజీవి(Chiranjeevi ) నటిస్తున్న విశ్వంభర( vishwambhara ) సినిమా కూడా ఇంచుమించు ఇలాగే జరుగుతుంది.
కేవలం సెట్స్ కోసమే 50 కోట్లకు పైగానే ఖర్చు పెట్టిస్తున్నారట దర్శకుడు వశిష్ట.