తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు( Telangana assembly meetings ) రేపటికి వాయిదా పడ్డాయి.వాటర్ వార్ పై అసెంబ్లీలో హాట్ హాట్ గా చర్చ జరిగింది.
ఈ క్రమంలోనే ప్రాజెక్టులను కేఆర్ఎంబీకి అప్పగించొద్దన్న తీర్మానానికి అసెంబ్లీ ఆమోదం తెలిపింది.ఈ మేరకు అసెంబ్లీలో తీర్మానాన్ని మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి( Uttam Kumar Reddy ) ప్రవేశపెట్టారు.
ప్రాజెక్టులను అప్పగించే ప్రసక్తే లేదని అన్ని పార్టీల నేతలు తేల్చిచెప్పారు.
ఈ క్రమంలోనే ప్రాజెక్టులను కేఆర్ఎంబీకి( KRMB ) అప్పగించొద్దన్న తీర్మానానికి ఏకగ్రీవ ఆమోదం లభించింది.ఈ నేపథ్యంలోనే అసెంబ్లీని స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్( Gaddam Prasad Kumar ) రేపటికి వాయిదా వేశారు.మరోవైపు ఉదయం మంత్రులు, ఎమ్మెల్యేలు మేడిగడ్డ బ్యారేజ్ సందర్శనకు వెళ్లనున్నారు.
రేపు సాయంత్రం 3 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు మేడిగడ్డ బ్యారేజ్ సందర్శన ఉండనుంది.తరువాత సాయంత్రం 4 గంటలకు మేడిగడ్డ వద్ద సీఎం రేవంత్ రెడ్డి( CM Revanth Reddy ) పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఉండనుంది.