అప్పుడు చాయ్ వాలా... ఇప్పుడు ఫేమస్ మోడల్

సోషల్ మీడియా ప్రభావం వలన చాలామంది రాత్రికి రాత్రే ఫేమస్ అయిపోతున్నారు.ఊహించని విధంగా వారి అందంతోనే, టాలెంట్ తోనో పాపులారిటీ సొంతం చేసుకుంటున్నారు.

 Tea Seller-turned Model Arshad Khan Chaiwala Opens Cafe, Modeling, Chaiwala, Mod-TeluguStop.com

సోషల్ మీడియా వలన ప్రపంచం అంతా ఒక కుగ్రామంలా మారిపోవడంతో ఎక్కడ ఎం జరిగిన ప్రపంచం మొత్తం క్షణాలలో తెలిసిపోతుంది.ఇలా ఫేమస్ అవుతున్నవారు కటిక పేదరికం నుంచి రాత్రికి రాత్రి కోటీశ్వరులు అయిపోతున్నవారు కూడా ఉన్నారు.

ఇప్పుడు అలాంటి ఓ వ్యక్తి టీ కొట్టు నుంచి ఫేమస్ మోడల్ స్థాయికి ఎదిగిపోయాడు.అతని అందమే అతనికి ఆ స్థాయి గుర్తింపు తీసుకొచ్చింది.

పాకిస్తాన్ లోని ఇస్లామాబాద్ కు చెందిన జవేరియా అలీ అనే ఫోటోగ్రాఫర్ ఫోటోల కోసం వీధుల్లో తిరుగుతూ మర్డన్ సిటీకి వెళ్లింది.అక్కడ ఓ దుకాణంలో అర్షద్ ఖాన్ అనే యువకుడు టీ చేస్తూ కనిపించాడు.

ఫోటో తీసి తన ఇన్స్టాగ్రామ్ లో పెట్టింది.నీలికళ్లతో అందంగా ఉన్న అర్షద్ ఫోటో పాకిస్తాన్ లో పెద్ద సంచలనమే అయ్యింది.

అతనితో ఫోటోలు తీసుకునేందుకు అమ్మాయిలు క్యూలు కట్టారు.

రోజూ ఉదయాని కల్లా 40 నుంచి 50 మంది అమ్మాయిలు టీ కొట్టు దగ్గరికొచ్చి అతనితో సెల్ఫీలు దిగి వెళ్ళేవారు.

ఛాయ్ వాలా మోడల్ లా ఉన్నాడు అంటూ చాలామంది కామెంట్స్ చేశారు.ఇప్పుడు ఆ ఛాయ్ వాలాని అదృష్టం వరించింది.దాంతో యాడ్ ఏజెన్సీలో అతన్ని మోడల్ గా పరిచయం చేశాయి.దీంతో పాకిస్తాన్ లో పెద్ద మోడల్ అయిపోయాడు.

అర్షద్ కి మోడల్ గా మంచి అవకాశాలు రావడంతో సంపాదన కూడా పెరిగింది.దీంతో తాజాగా ఛాయ్ వాలా రూఫ్ టాప్ పేరుతో అతను ఓ హైటెక్ కేఫ్ ను మొదలుపెట్టాడు.

పేరు లో ఛాయ్ వాలా అని తీసేయమని కొందరు చెప్పినా తన జీవితం అక్కడి నుంచే ఆరంభం అయ్యింది కాబట్టి అదే నా బ్రాండ్ అంటూ చెప్పుకుంటున్నాడు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube