టీడీపీ అధినేత చంద్రబాబుకు ఐటీ నోటీసులపై ఏపీ ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి చేసిన వ్యాఖ్యలను టీడీపీ నేత ధూళిపాళ్ల నరేంద్ర తీవ్రంగా ఖండించారు.సజ్జల తన స్థాయికి మించి మాట్లాడుతున్నారని మండిపడ్డారు.
కారణాలు ఏమైనా తనది, తన యజమానిది ఇతరుల జీవితాల గురించి మాట్లాడేంత గొప్పది కాదని సజ్జల తెలుసుకోవాలంటూ ధూళిపాళ్ల ఘాటు వ్యాఖ్యలు చేశారని తెలుస్తోంది.కూతుళ్ల దగ్గరకు వెళ్లడానికి కోర్టు అనుమతి పొందాల్సిన నేత దగ్గర పని చేసే వ్యక్తులు ఇతరుల గురించి మాట్లాడటం హాస్యాస్పదంగా ఉందని ఎద్దేవా చేశారు.
రాష్ట్రంలో ఎన్నికలు జరిగి ఫలితాలు వచ్చిన తరువాత సజ్జల బతుకు ఏంటి అనేది ఒకసారి ఆలోచించుకోవాలంటూ వ్యాఖ్యలు చేశారని సమాచారం.