పవన్ ని కన్ఫ్యూజ్ చేస్తూ... వైసీపీ, టీడీపీ లాభపడుతున్నాయా ...?

రాజకీయాల్లో శాశ్వత మిత్రులు శాశ్వత శత్రువులు ఉండరు అనేది ఎంత నిజమో… ఏ వ్యక్తి అయినా… ఏ పార్టీ అయినా తమ సొంత లాభాలకోసమే పనిచేస్తాయన్నది నేటి రాజకీయాలు నిరూపిస్తున్న నిజం.ఎవరినైనా.

 Tdp And Ycp Puts Janasena In To Confusion-TeluguStop.com

అవసరాలమేరకు వాడుకోవడం అవసరం తీరాక తొక్కేయడం ఇప్పుడు కామన్ అయిపోయింది.ఇక ఏపీ రాజకీయాల విషయానికి వస్తే… గత ఎన్నికల్లో మిత్ర పక్షాలుగా ఉన్నవారు … నేడు విడివిడిగా ఎన్నికల బరికి వెళ్లేందుకు సిద్ధం అయ్యారు.

ఏపీలో అప్పటికే బలమైన పార్టీలుగా వైసీపీ , టీడీపీ లు ఉన్నాయి.అయితే ఈ రెండు పార్టీలకు ప్రత్యామ్న్యాయంగా… జనసేన పార్టీ పుట్టుకొచ్చి ఈ రెండు పార్టీలను భయపెట్టే స్థాయికి చేరిపోయింది.

అంతే కాదు టిడిపి, వైసిపి లకు బలమైన ప్రత్యామ్నాయంగా జనసేన ఎదగాలని ప్రయత్నం చేస్తుంది.

ఇక రాజకీయాల్లో బాగా ఆరితేరిపోయిన చంద్రబాబు .జగన్ లను ఢీ కొట్టడం అంటే ఆషామాషీ వ్యవహారం కాదు.ఎందుకంటే వీరిద్దరూ రాజకీయాలను కాచి వడపోసినవారే.

అయితే ఇప్పడు ఈ ఇద్దరు రాజకీయ పండితులు ఆడుతున్న రాజకీయ ఆటలో జనసేన .జనసైనికులు గందరగోళానికి గురవుతున్నారు.కొంత కాలం నుంచే వైసిపి తో పొత్తు ఖరారు కాబోతుంది అంటూ అనేక కధనాలు వచ్చాయి.

వైసీపీ – జనసేన మధ్య సీట్ల బేరం జరుగుతోందని… చర్చలు చివరిదశలో ఉన్నాయని… అనేక ప్రచారాలు జరిగాయి.

ఆ గాలి వార్తలు తగ్గుముఖం పట్టాయని రిలాక్స్ అవుతున్న జనసేనకు టిడిపి తోనే పవన్ జత కట్టడం ఖాయం అన్న రీతిలో ప్రచారం స్టార్ట్ అవ్వడం పవన్ లో కోపం మరింత పెరగడానికి కారణం అయ్యింది.

ఈ విధమైన ప్రచారాలు ప్రజలను, పార్టీ కార్యకర్తలను ఒక విధమైన గందరగోళానికి గురి చేస్తున్నాయి.ఏపీలో ప్రధాన పార్టీలైన టిడిపి, వైసిపి లకు కావలిసింది కూడా ఇదే.జనసేన ను మూడో స్థానంలోకి మానసికంగా నెట్టివేసేలా ఇరు పార్టీలు నడిపిస్తున్న మైండ్ గేమ్ లో పవన్ గట్టిగానే నలిగిపోతున్నారు.ఇక మెతక వైఖరి అసలుకే ఎసరు తెస్తుందని ఆలస్యంగా గ్రహించారు.అందుకే … టీడీపీ ఎంపీ టిజి వెంకటేష్ జనసేనతో టిడిపి పొత్తు ఖాయమే అన్న రీతిలో చేసిన వ్యాఖ్యలపై పవన్ ఒక రేంజ్ లో చెలరేగిపోయారు.

స్ట్రాంగ్ వార్నింగ్ టిడిపికి పంపారు.

జనసేన లో జరిగిన అంతర్గత చర్చల్లో ప్రజారాజ్యం లాగే పీకే పార్టీని తొక్కేసే ప్రయత్నాలు ఆదిలోనే గుర్తించి స్పందించాలన్న వత్తిడి వచ్చిందని తెలుస్తుంది.

వాస్తవానికి టీడీపీ లో బాబు ఆదేశాలు లేకుండా ఎవరుబడితే వారు ఇష్టం వచ్చినట్లు మాట్లాడే స్వతంత్రం లేదు.కానీ టిజి పొత్తుల వంటి కీలక అంశంపై నేరుగా వ్యాఖ్యానించడం అనేది టీడీపీ వ్యూహంలో భాగమే అన్న విషయాన్ని పవన్ ఆలస్యంగా గ్రహించాడు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube