ఎయిరిండియా ప్రైవేటీకరణలో కీలక ప్రక్రియ ముగిసినట్లు తెలుస్తోంది.అప్పుల ఊబిలో కూరుకుపోయిన ఎయిరిండియాను దక్కించుకునేందుకు చాలా సంస్థలు బిడ్లు దాఖలు చేయగా.
టాటా సన్స్ ను విజయవంతమైన బిడ్డర్ గా ఎంపిక చేసినట్లు ప్రముఖ వాణిజ్య పత్రిక బ్లూమ్ బెర్గ్ తెలిపింది.మరోవైపు ఈ అంశంపై టాటా సన్స్ ఎప్పటి వరకు ఎలాంటి అధికార ప్రకటన చేయలేదు.
అలాగే ఎయిరిండియా సైతం స్పందించలేదు.అయితే.
టాటా సన్స్ దాఖలుచసిన బిడ్డ్ ఆకర్షణీయంగా ఉందని గత కొన్ని రోజులుగా వివిధ వర్గాల ద్వారా వార్తలు బయటకు వచ్చాయి.అక్టోబర్ 15 దసరా నాటికి విజయవంతమైన బిడ్డర్ పేరును ప్రకటించేందుకు కసరత్తులు జరుగుతున్నట్లు వార్తలు వచ్చాయి.
ఈ నేపథ్యంలో అధికార ప్రకటన ఎప్పుడూ వెలువడుతున్నది స్పష్టత రావాల్సి ఉంది.గత నెల 29న ఆర్థిక బిడ్లు దాఖలు చేసినట్లు తెలుస్తోంది.
బిడ్ మొత్తంలో ఎయిరిండియా రుణాలకు 85 శాతం, నగదుగా 15 శాతం బిడ్డర్లలు చెల్లించాల్సి ఉంటుంది.ఎయిర్ ఇండియా కోసం చాలా సంస్థలు ఆర్ధిక బిడ్లు దాఖలు చేసినట్లు సమాచారం.
టాటా సన్స్ సహా స్పైస్ జెెట్ అధిపతి అజయ్ సింగ్ కూడా ఆర్ధిక బిడ్లు సమర్పించారు.ప్రభుత్వంవం ఇటీవలే ఎయిరిండియా మినిమం రిజర్వ్ ప్రైస్ కరారు చేసినట్లు గురువారం వార్తలు వెలువడ్డాయి.
భవిష్యత్తులో క్యాష్ లో అంచనాలు బ్రాండ్ విలువ, విదేశీ విమానాశ్రయాల్లో స్లాట్ ఆధారంగా రిజర్వు ప్రైస్ ను నిర్ణయించినట్లు సంబంధిత వర్గాలు తెలిపాయి.ఎయిరిండియాను దక్కించుకునే రేసులో టాటా సంస్థ ముందు దూకుడుగా ఉన్నారు.

అలాగే సంస్థ పునరుద్ధరణకు కావలసిన నిధులను సమకూర్చే సత్తా టాటా లకు మాత్రమే ఉందని పరిశ్రమకు చెందిన పలువురు నిపుణులు అభిప్రాయపడ్డారు.పైగా వీరికి విమానయాన రంగంలో మంచి అనుభవం కూడా ఉంది.ఇప్పటికే పలు విమానయాన సంస్థల్లో వాటాలు ఉన్నాయి ఆసక్తికరమైన విషయం ఏమిటంటే.ఎయిరిండియాను ప్రారంభించింది టాటాలే… 1932లో టాటా ఎయిర్లైన్స్ పేరిట టాటా గ్రూప్ విమానయాన రంగంలోకి ప్రవేశించింది.1953లో జాతీయకరణ తో ఈ సంస్థ ప్రభుత్వ పరం అయింది.అయితే.1977 వరకు టాటాయే సంస్థ నిర్వహణలో కీలకపాత్ర పోషించింది.ఈ బిడ్లు విజయవంతం అయితే 68 ఏళ్ల తర్వాత వారు ప్రారంభించిన సంస్థ వారి చేతుల్లోకి వెళ్ళవచ్చు.
అంతా సవ్యంగా సాగితే డిసెంబర్ నాటికి ప్రభుత్వ పెట్టుబడులు ఉపసంహరణ ప్రక్రియ పూర్తయ్యే అవకాశం ఉంది.దాంతో కొత్త యాజమాన్యం చేతుల్లోకి వెళ్ళిపోతుంది.

కానీ ఈ ప్రచారంపై కేంద్ర ప్రభుత్వం భిన్నగా స్పందించింది.ఈ బిడ్డింగ్ లో టాటా గ్రూపు విజయం సాధించినట్లు వచ్చిన కథనాలు సరికాదని పేర్కొంది.ఎయిరిండియా పెట్టుబడుల ఉపసంహరణ వ్యవహారంలో బిడ్లలకు కేంద్రం ఆమోదం తెలిపినట్లు వచ్చిన వార్తలు తప్పు అని పేర్కొంటూ కేంద్ర పెట్టుబడులు ప్రభుత్వ ఆస్తులు నిర్వహణ విభాగం(డీఐపీఎం) కార్యదర్శి ట్విట్టర్ లో స్పష్టం చేశారు.దీనికి ఏదైనా నిర్ణయం తీసుకుంటే మీడియాకు వెల్లడిస్తామని పేర్కొన్నారు.