Tasty Teja: ఆ బిగ్ బాస్ కంటెస్టెంట్ తో టేస్టీ తేజ ప్రేమలో పడ్డారా.. పెళ్లి జరిగేది అప్పుడేనా?

తెలుగులో ప్రసారమవుతున్న బిగ్ బాస్ సీజన్ 7( Bigg Boss 7 ) గురించి మనందరికీ తెలిసిందే.ఇటీవలె మొదలైన ఈ షో చూస్తుండగానే అప్పుడే ఆరు వారాలను విజయవంతంగా పూర్తి చేసుకుంది.

 Tasty Teja Clarity About Marriage With Shobha Shetty In Bigg Boss Telugu 7 Show-TeluguStop.com

ప్రస్తుతం ఏడవ వారం రసవత్తరంగా సాగుతోంది.ఇదిలా ఉంటే ప్రస్తుతం హౌస్ లో కంటెస్టెంట్‌గా ఉన్న టేస్టీ తేజ( Tasty Teja ) తన పెళ్లి గురించి చేసిన కామెంట్స్ హైలైట్ అయ్యాయి.

బిగ్ బాస్ ఇంట్లోకి ఎంట్రీ ఇచ్చినప్పటి నుంచే టేస్టీ తేజ తనదైన రీతిలో కామెడీని పంచే ప్రయత్నాలు చేస్తున్నాడు.ప్రతి ఒక్కరినీ గౌరవంగానే పలకరిస్తూ, అప్పుడప్పుడూ పంచులు, సెటైర్లు వేశాడు.

మధ్యలో కాస్త ఓవర్ యాక్షన్ చేయడంతో విమర్శలు వచ్చాయి.

Telugu Love, Shobha Shetty, Tasty Teja, Tastyteja-Movie

దీంతో తనను తాను మార్చుకుని మంచితనంతో ముందుకెళ్తున్నాడు.ఫలితంగా తిట్టిన వాళ్లే పొగడుతున్నారు.కాగా హౌస్‌లో టేస్టీ తేజ అందరితోనూ కలివిడిగానే ఉంటున్నాడు.

కానీ, ఎక్కువగా శోభా శెట్టితో( Sobha Shetty ) అతడు సన్నిహితంగా ఉంటున్నాడు.తరచూ ఆమెతోనే ఉంటూ, ఆమె చెప్పినట్లే చేస్తూ సరదాగా సాగిపోతోన్నాడు.

ముఖ్యంగా శోభను సైట్ కొడుతున్నట్లుగా టీజ్ చేస్తూ మజాను పంచుతున్నాడు.ఫలితంగా వీళ్లిద్దరి బంధం మరింత బలపడడంతో పాటు కంటెంట్ కూడా దొరుకుతోంది.

కాగా తాజాగా జరిగిన ఎపిసోడ్‌లో టేస్టీ తేజ తన పెళ్లిపై క్లారిటీ ఇచ్చాడు.దీన్ని లైవ్‌ స్ట్రీమింగ్‌లోనే చూపించారు.

Telugu Love, Shobha Shetty, Tasty Teja, Tastyteja-Movie

పూజా తేజా షో అయిన వెంటనే పెళ్లి చేసుకుంటావా అని అతడిని అడిగింది.దీనికి తేజ వెంటనే కాదు కానీ ఒక సంవత్సరంలో చేసుకుంటాను.అమ్మాయి కూడా మీ ఫ్రెండే.మీ అందరినీ పిలుస్తాను అంటూ శోభా శెట్టిని పెళ్లి చేసుకుంటా అన్నట్లు చెప్పాడు.ఆ తర్వాత తేజ మాట్లాడుతూ.ఎంగేజ్‌మెంట్( Engagement ) అయితే వచ్చే జనవరిలో చేసుకుంటాము.

అది బెంగళూరులో జరుగుతుంది.పెళ్లి మాత్రం మా పద్దతి ప్రకారం మా ఇంటి దగ్గరే చేసుకుంటాము.

నిశ్చితార్థానికి మీతో పాటు మా రెండు ఫ్యామిలీల వాళ్లు వస్తారు.పెళ్లి మాత్రం గ్రాండ్‌గా చేసుకుంటాము అని చెప్పుకొచ్చాడు.

ఇదంతా విన్న శోభా తనలో తాను తెగ నవ్వుకుంటూ కనిపించింది.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube