ఎన్టీఆర్ కొరటాల శివ కాంబో మూవీ సెకండ్ హీరోయిన్ గా నటించేది ఈమేనా?

Tarak Koratala Shiva Combo Movie Second Heroine Details Here Goes Viral In Social Media , Prakash Raj, Srikanth,Janhvi Kapoor,tarak,koratala Shiva ,tarak Koratala Shiva Combo,NTR

తారక్ కొరటాల శివ( Tarak Koratala Shiva ) కాంబో మూవీలో మెయిన్ హీరోయిన్ గా జాన్వీ కపూర్( Janhvi Kapoor ) ఇప్పటికే ఎంపికయ్యారు.ఈ సినిమా పూజా కార్యక్రమాలకు సైతం జాన్వీ కపూర్ హాజరయ్యారనే సంగతి తెలిసిందే.ఎన్టీఆర్30 రెగ్యులర్ షూట్ మొదలు కాగా నిన్న రాత్రి తారక్ పై కొన్ని మాంటేజ్ షాట్స్ ను షూట్ చేశారని తెలుస్తోంది.సినిమాటోగ్రాఫర్ రత్నవేలు ఈ సినిమా షూట్ మొదలైన విషయాన్ని వెల్లడించారు.

 Tarak Koratala Shiva Combo Movie Second Heroine Details Here Goes Viral In Socia-TeluguStop.com

ప్రకాష్ రాజ్, శ్రీకాంత్( Prakash Raj, Srikanth ) ఈ సినిమాలో కీలక పాత్రల్లో నటిస్తుండగా బాలీవుడ్ నటీనటులకు సైతం ఎక్కువగానే ప్రాధాన్యత ఉంటుందని సమాచారం అందుతోంది.భారీ బోటు సెట్ లో ప్రస్తుతం సన్నివేశాల షూటింగ్ జరుగుతోంది.

అత్యంత భారీ బడ్జెట్ తో ఈ మూవీ తెరకెక్కుతుండగా అతి త్వరలో ఈ సినిమా టైటిల్ కు సంబంధించిన వివరాలు వెల్లడయ్యే ఛాన్స్ అయితే ఉంది.కెన్నీ బేట్స్ ఈ సినిమా కోసం పని చేస్తున్నారు.

హలీవుడ్ యాక్షన్ కొరియోగ్రాఫర్ ఈ సినిమా కోసం పని చేస్తుండటం ఈ సినిమాకు మరింత ప్లస్ అవుతోంది.యువసుధ ఆర్ట్స్, ఎన్టీఆర్ ఆర్ట్స్ సంయుక్తంగా ఈ సినిమాను నిర్మిస్తుండగా పాన్ ఇండియా మూవీ తెరకెక్కుతున్న ఈ సినిమాలో కృతిశెట్టి( Kriti Shetty ) మరో హీరోయిన్ గా నటిస్తున్నారని వార్తలు వినిపిస్తున్నాయి.వచ్చే ఏడాది ఏప్రిల్ లో ఈ మూవీ థియేటర్లలో రిలీజ్ కానుంది.

కృతిశెట్టి ఈ సినిమాలో సెకండ్ హీరోయిన్ గా నటిస్తున్నట్టు అధికారిక ప్రకటన రావాల్సి ఉంది.ఎన్టీఆర్ కృతిశెట్టి జోడీ బాగుంటుందని కామెంట్లు వినిపిస్తున్నాయి.ఎన్టీఆర్ కు జోడీగా ఛాన్స్ ఇస్తే కృతిశెట్టి కెరీర్ కు మేలు జరుగుతుందని కామెంట్లు వినిపిస్తున్నాయి.

త్వరలో ఈ సినిమాలో నటించే నటీనటుల వివరాలు వెల్లడి కానున్నాయి.తారక్ కొరటాల శివలకు క్రేజ్ అంతకంతకూ పెరుగుతుండటం గమనార్హం.

Tarak Koratala Shiva Combo Movie Second Heroine Details Here Goes Viral In Social Media , Prakash Raj, Srikanth,Janhvi Kapoor,tarak,koratala Shiva ,tarak Koratala Shiva Combo,NTR - Telugu Janhvi Kapoor, Koratala Shiva, Kriti Shetty, Prakash Raj, Srikanth, Tarak, Tarakkoratala #TeluguStopVideo

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube