వేసవికాలంలో ఎన్నో రుచికరమైన పండ్లు లభిస్తాయి.ఆ పండ్లలో నల్ల ద్రాక్ష ఒకటి.
దీనిని బ్లాక్ కరెంట్ అని కూడా పిలుస్తారు.ఎరుపు నలుపు కలిసి ఉండే ఈ ద్రాక్షలో రుచి పుల్లగా అలాగే తీపిగా ఉంటుంది.
అయితే నల్ల ద్రాక్ష తినడం వల్ల ఎన్నో ప్రయోజనాలు ఉన్నాయి.నల్ల ద్రాక్ష ఒక పోషకాలా నిధి అని చెప్పవచ్చు.
దీని ప్రత్యేకత ముఖ్యంగా ఏమిటంటే ఇది చాలా త్వరగా జీర్ణం అవుతుంది.నల్ల ద్రాక్ష జ్యూస్ లో రోగ నిరోధక శక్తిని పెంచే ఎన్నో పోషకాలు ఉన్నాయి.
నల్ల ద్రాక్ష( Black grapes ) నుండి రిఫ్రెష్ జ్యూస్ తయారు చేసుకోవచ్చు.ఈ సీజన్లో మండే ఎండల నుండి బయట పడాలంటే మిమ్మల్ని మీరు రక్షించుకోవాలంటే ఇంట్లో నల్ల ద్రాక్ష రసాన్ని తయారుచేసుకొని తాగవచ్చు.
నల్ల ద్రాక్ష జ్యూస్ తాగడం( Grape juice ) వల్ల ఎలాంటి ప్రయోజనాలు కలుగుతాయో ఇప్పుడు తెలుసుకుందాం.నల్ల ద్రాక్షలో మేథియోనిన్, థ్రెయోనిన్ అనే ఫైటో కెమికల్స్ పుష్కలంగా ఉంటాయి.
ఇవి గుండె ఆరోగ్యంగా( Heart Health ) ఉండేందుకు సహాయపడతాయి.అదేవిధంగా రక్తప్రసరణ కూడా మెరుగుపరుస్తాయి.
రక్త పోటీలను నియంత్రించడంలో అలాగే శరీరంలో ఉన్న విష పదార్థాలను బయటకు పంపడం ద్వారా రక్త శుద్ధి చేయడంలో ఇవి ఉపయోగపడతాయి.అదేవిధంగా అక్షరాలు నల్ల ద్రాక్షలో తక్కువ గ్లైసిమిక్ ఇండెక్స్ ఉంటుంది.డయాబెటిస్ తో బాధపడుతున్న వారికి ఇది చాలా ఉపయోగకరంగా ఉంటుంది.నల్ల ద్రాక్ష రక్తంలో చక్కెర స్థాయిలను తగ్గించడానికి పనిచేస్తుంది.
నల్ల ద్రాక్షలో ఉండే మరొక ప్రయోజనం ఏమిటంటే ఇది శరీరంలో ఉండే వేడిని తొలగిస్తుంది.అదేవిధంగా శరీరానికి చల్లదనాన్ని అందిస్తుంది.అందుకే వేసవికాలంలో నల్లద్రాక్ష రసం తాగితే చాలా త్వరగా వేడి నుండి ఉపశమనం పొందవచ్చు.అదేవిధంగా నల్లద్రాక్ష షర్బత్ తాగడం ద్వారా కీళ్ల నొప్పు(Joint pains )ల నుండి ఉపశమనం పొందవచ్చు.
చర్మానికి కూడా నల్ల ద్రాక్ష చాలా మేలు చేస్తుంది.