అమృత్‌పాల్‌కు మద్ధతు.. ఖలిస్తాన్ నినాదాలతో మారుమోగిన న్యూయార్క్ టైమ్స్ స్క్వేర్

ఖలిస్తాన్( Khalistan ) వేర్పాటువాద నేత , వారిస్ పంజాబ్ దే చీఫ్ అమృత్‌పాల్ సింగ్( Amritpal Singh ) కోసం పంజాబ్ , కేంద్ర ప్రభుత్వాలు భారీ సెర్చ్ ఆపరేషన్‌ను కొనసాగిస్తున్న సంగతి తెలిసిందే.ఇతని వ్యవహారం భారత్‌తో పాటు చాలా దేశాల్లో అలజడి రేపుతోంది.

 Khalistan Supporters Protest At Times Square In New York  ,  New York, Khalistan-TeluguStop.com

ఇతనిని అరెస్ట్ చేయకుండా భారత ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకొచ్చేందుకు కొన్ని శక్తులు తీవ్రంగా ప్రయత్నిస్తున్నాయి.బ్రిటన్, ఆస్ట్రేలియా, కెనడా, అమెరికా తదితర దేశాల్లో స్థిరపడిన ఖలిస్తాన్ మద్ధతుదారులు భారతీయ దౌత్య కార్యాలయాలను లక్ష్యంగా చేసుకుని నిరసనలకు దిగుతున్నారు.

రోజులు గడుస్తున్నా అమృత్‌పాల్ ఆచూకీ దొరకకపోవడంతో సిక్కులకు పరమ పవిత్రమై అకల్‌తఖ్త్ జాతేదర్( Akaltakht Jathedar ) స్పందించారు.ఎక్కడున్నా సరే పోలీసులకు తక్షణం లొంగిపోవాలని అమృత్‌పాల్‌ను ఆయన కోరారు.

Telugu America, Amritpal Singh, Australia, Babamakhan, Britain, Canada, Khalista

మరోవైపు.ఖలిస్తాన్ మద్ధతుదారుల ఆందోళన మాత్రం ఆగడం లేదు.తాజాగా అమృత్‌పాల్ సింగ్‌కు మద్ధతుగా న్యూయార్క్‌లోని టైమ్స్ స్క్వేర్‌ వద్ద పెద్ద ఎత్తున ఖలిస్తాన్ సానుభూతిపరులు నిరసనకు దిగారు.ఆదివారం రిచ్‌మండ్ హిల్ పరిసరాల్లోని బాబా మఖాన్ షా లుబానా( Baba Makhan Shah Lubana ) సిక్కు సెంటర్ నుంచి వీరు కార్లతో ర్యాలీగా మధ్యాహ్నానికి మాన్‌హట్టన్ నడిబొడ్డున వున్న టైమ్స్ స్క్వేర్ వద్దకు చేరుకున్నారు.

భారీ డీజేలు, చెవులకు చిల్లులు పడేలా పెద్దగా హార్న్‌ చేసుకుంటూ , అమృత్‌పాల్ ఫోటోలు, ఖలిస్తాన్ జెండాలను పట్టుకుని హల్‌చల్ సృష్టించారు.అమృత్‌పాల్‌ను విడుదల చేయాలంటూ.భారత్‌కు వ్యతిరేకంగా నినాదాలు చేశారు.అంతేకాదు.

టైమ్స్ స్క్వేర్ బిల్‌బోర్డ్‌లపైనా అమృత్‌పాల్ ఫోటోలను ప్రదర్శించారు.అయితే అప్పటికే గత కొద్దిరోజులుగా జరుగుతున్న పరిణామాలు, భారత ప్రభుత్వ హెచ్చరికలతో న్యూయార్క్( New York ) సిటీ పోలీస్ డిపార్ట్‌మెంట్ ఆ ప్రాంతంలో భారీగా బందోబస్త్ ఏర్పాటు చేసింది.

Telugu America, Amritpal Singh, Australia, Babamakhan, Britain, Canada, Khalista

కాగా.శనివారం వాషింగ్టన్‌లో వున్న ఇండియన్ ఎంబసీ వద్ద ఉద్రిక్తత చోటు చేసుకున్న సంగతి తెలిసిందే.ఖలిస్తాన్ మద్ధతుదారులు కార్యాలయం వద్దకు చేరుకుని హింసను సృష్టించేందుకు ప్రయత్నించారు.అయితే యూఎస్ సీక్రెట్ సర్వీస్, స్థానిక పోలీసులు అప్పటికే ఓ కన్నేసి వుంచారు.ఈ నేపథ్యంలో వెంటనే జోక్యం చేసుకుని శాన్‌ఫ్రాన్సిస్కో, లండన్ తరహా ఘటనలు వాషింగ్టన్‌లో చోటు చేసుకోకుండా అడ్డుకున్నారు.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు NRI వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube