మా నాన్న చెప్పులు కుట్టేవారు.. అప్పటివరకు చెప్పులు వేసుకోలేదు.. తనికెళ్ల కామెంట్స్ వైరల్!

టాలీవుడ్( Tollywood ) ఇండస్ట్రీలో భిన్నమైన పాత్రల్లో ఎక్కువగా నటించి మెజారిటీ సినిమాలతో విజయాలను సొంతం చేసుకున్న వాళ్లలో తనికెళ్ల భరణి ఒకరు.తనికెళ్ల భరణి( Tanikella Bharani ) ఎలాంటి పాత్రలో నటించినా ఆ పాత్రలకు పూర్తిస్థాయిలో న్యాయం చేస్తారు.

 Actor Tanikella Bharani Comments About His Father Details Here Goes Viral In Soc-TeluguStop.com

అయితే తనికెళ్ల భరణి కుటుంబం గురించి కానీ, ఇతర విషయాల గురించి కానీ అభిమానులకు ఎక్కువగా తెలియదు.ఒక ఇంటర్వ్యూలో తనికెళ్ల భరణి తన తండ్రి గురించి చెబుతూ ఎమోషనల్ అయ్యారు.

మా నాన్న చెప్పులు కుట్టేవారని నాకు మాత్రం ఏడో తరగతి వరకు చెప్పులు( sandals ) లేవని తనికెళ్ల భరణి కామెంట్లు చేశారు.నాన్నతో ఎలా చెప్పులు కొనిపించాలని ఆలోచించేవాడని ఆయన చెప్పుకొచ్చారు.

మేము ఏడుగురు అన్నాదమ్ములమని రోజూ కూరల కోసం మాత్రం నాన్న నన్ను తీసుకొని వెళ్లేవారని తనికెళ్ల భరణి కామెంట్లు చేశారు.నా కాలు కాలితే నాన్న చెప్పులు కొనిస్తాడని భావించగా నాన్న మాత్రం నన్ను కొట్టాడని తనికెళ్ల భరణి పేర్కొన్నారు.

మధ్య తరగతిలో ఉండటం, మధ్య తరగతిలో బ్రతకడం మా నాన్న నాకు నేర్పించాడని ఆయన కామెంట్లు చేశారు.మా నాన్న కంట నీరు నేను ఏనాడు చూడలేదని తనికెళ్ల భరణి చెప్పుకొచ్చారు.ఎన్ని కష్టాలు చూసినా మా నాన్న బాధ పడలేదని ఆయన అన్నారు.మిథునంలో ఎస్పీ బాలు( SP Balu ) పాత్ర మా నాన్న రోల్ అని ఫుడ్ విషయంలో తప్ప మిగతా అన్ని విషయాల్లో సేమ్ టు సేమ్ అని తనికెళ్ల భరణి చెప్పుకొచ్చారు.

తనికెళ్ల భరణి కెరీర్ విషయంలో ఆచితూచి అడుగులు వేస్తూ వయస్సుకు తగ్గ పాత్రలను ఎంచుకుంటున్నారు.తనికెళ్ల భరణి కెరీర్ పరంగా మరిన్ని విజయాలను అందుకోవాలని ఆయన ఫ్యాన్స్ కోరుకుంటున్నారు.సోషల్ మీడియాలో సైతం తనికెళ్ల భరణికి ఊహించని స్థాయిలో ఫ్యాన్ ఫాలోయింగ్ పెరుగుతుండటం గమనార్హం.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube