పవన్ కళ్యాణ్ తో సినిమా చేయడం చాలా కష్టం అంటున్న తమిళ్ డైరెక్టర్...కారణం ఏంటంటే..?

మెగాస్టార్ చిరంజీవి తమ్ముడిగా ఇండస్ట్రీ ఎంట్రీ ఇచ్చిన పవర్ స్టార్ పవన్ కళ్యాణ్( Pawan Kalyan ) ప్రస్తుతం వరుస సినిమాలు చేస్తూ ముందుకు దూసుకెళ్తున్నాడు.ఇక ఈయన చేసిన ప్రతి సినిమా ఇండస్ట్రీలో సూపర్ డూపర్ సక్సెస్ ని సాధించడమే కాకుండా అంతకుమించి ఆయనకు క్రేజీని కూడా సంపాదించి పెడుతున్నాయి.

 Tamil Director Sj Surya Says That Making A Film With Pawan Kalyan Is Very Diffic-TeluguStop.com

ఇదిలా ఉంటే ఇప్పటికే ఆయన కమిట్ అయిన చాలా సినిమాలని ఫినిష్ చేసే పనిలో ఉన్నాడు.ఇక ప్రస్తుతానికైతే ఆయన ఎలక్షన్స్ పనుల్లో బిజీగా ఉన్నాడు.

కాబట్టి ఈ ఎలక్షన్స్ అయిపోయిన తర్వాత ఆ సినిమాలను కంప్లీట్ చేసి మరి కొన్ని సినిమాల్లో కమిట్ అయ్యే అవకాశాలు అయితే ఉన్నాయి.

ఇక ఇప్పుడు అందుతున్న సమాచారం ప్రకారం అయితే తమిళ్ సినిమా ఇండస్ట్రీలో స్టార్ డైరెక్టర్ గా గుర్తింపు పొంది ప్రస్తుతం మంచి నటుడుగా అవార్డులను కూడా అందుకుంటున్న ఎస్ జె సూర్య( SJ Surya ) మాట్లాడుతూ ప్రస్తుతం పవన్ కళ్యాణ్ ఉన్న రేంజ్ లో ఆయనకి తగ్గ కథని రాసి సినిమా చేయడం అంటే చాలా కష్టం…ఎందుకు అంటే అతని ఫ్యాన్స్ ని మెప్పించాలి అంటే అతనిలో ఉన్న మేనరీజమ్స్ మొత్తాన్ని వాడుకొని సినిమాలు చేయాలి.

అలాంటి డైరెక్టర్లు ప్రస్తుతం కొందరు మాత్రమే ఉన్నారు కాబట్టి పవన్ రేంజ్ ని టచ్ చేయాలంటే చాలా కష్టం అంటూ ఆయన చేసిన కొన్ని కామెంట్లు ఇప్పుడు సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ అవుతున్నాయి.ఇక మొత్తానికైతే ఎస్ జె సూర్య ఒకప్పుడు పవన్ కళ్యాణ్ కి ఖుషి( Khusi Movie ) అనే సినిమాతో భారీ సక్సెస్ ని అందించాడు…ఇక ఇది ఇలా ఉంటే ప్రస్తుతం ఎస్.జే సూర్య వరుసగా సినిమాలు చేస్తూ నటుడిగా గొప్ప పేరు సంపాదించుకుంటున్నారు… ఇక మోత్తానికైతే ఆయన నటుడుగా సెటిల్ అయిపోయారనే చెప్పాలి…

.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube