తెలుగు సినిమా ఇండస్ట్రీలో రామ్ చరణ్( Ram Charan ) తనకంటూ ఒక ప్రత్యేకమైన గుర్తింపును సంపాదించుకున్నాడు.ఇక ఇలాంటి క్రమంలోనే మెగాస్టార్ చిరంజీవి తనయుడిగా ఎంట్రీ ఇచ్చి వరుస సినిమాలు చేయడమే కాకుండా ఇండస్ట్రీలో మంచి గుర్తింపుని కూడా సంపాదించుకున్నాడు.
ఇక సుకుమార్ దర్శకత్వంలో ఈయన చేసిన రంగస్థలం సినిమా( Rangasthalam ) సూపర్ సక్సెస్ అయింది.అయితే ఇప్పుడు ఈ కాంబో ఆర్ సి 17 కోసం మరోసారి కలవబోతున్నట్టుగా తెలుస్తుంది.
ఇక ఇదిలా ఉంటే ఈ సినిమాలో రంగమ్మత్త( Rangamatha ) క్యారెక్టర్ లో అనసూయ చాలా బాగా నటించి మెప్పించింది.
ఇక ఈ క్యారెక్టర్ లో.మొదట తమిళ్ ఇండస్ట్రీకి చెందిన సంపత్( Sampath ) ను తీసుకోవాలనుకున్నాడట.కానీ ఆ క్యారెక్టర్ గురించి తెలిసాక సంపత్ ఆ క్యారెక్టర్ ని రిజెక్ట్ చేశాడట.
దాంతో రాజీవ్ కనకాల( Rajiv Kanakala ) ఈ పాత్ర కోసం తీసుకోవాల్సి వచ్చిందట…ఇక రాజీవ్ కనకాల కూడా ఈ క్యారెక్టర్ లో చాలా బాగా నటించాడు.అయినప్పటికీ ఆయన కనిపించేది కొద్దిసేపే అవ్వడం తో ఆ పాత్రకి ప్రత్యేక గుర్తింపు అయితే రాలేదు.
ఇక ఈ క్యారెక్టర్ లో సంపత్ కనక చేసినట్లయితే ఆయన పరిస్థితి కూడా అలాగే అయిపోయేది.అందువల్లే ఆయన ఆ క్యారెక్టర్ రిజెక్ట్ చేశారట.
నిజానికి ఆ డైరెక్టర్ ఇంకో పది నిమిషాలు ఎక్స్ ట్రా గా కనబడాల్సి ఉన్నప్పటికీ లెంత్ ఎక్కువ అవ్వడంతో ఆ క్యారెక్టర్ ను కట్ చేసినట్టుగా కూడా కొన్ని వార్తలైతే వస్తున్నాయి.ఇక మొత్తానికైతే సంపత్ సుకుమార్( Sukumar ) సినిమాలో నటించే అవకాశం వచ్చిన కూడా దాన్ని మిస్ చేసుకున్నాడనే చెప్పాలి…ఇక ఇది ఇలా ఉంటే ప్రస్తుతం సుకుమార్ పుష్ప 2 సినిమా( Pushpa 2 )తో భారీ సక్సెస్ కొట్టడానికి రెడీ అవుతున్నాడు… ఈ సినిమాతో ఆయన స్టార్ డైరెక్టర్ గా మరోసారి తన సత్తా చూపించు కావాలని చూస్తున్నాడు…