లెజెండ్ శరవణన్ మల్టీ లాంగ్వెంజ్ భారీ పాన్-ఇండియా చిత్రం ‘ది లెజెండ్’ తో కధానాయకుడిగా పరిచయం అవుతున్నారు.లెజెండ్ న్యూ శరవణ స్టోర్స్ ప్రొడక్షన్స్ పతాకంపై ఆయనే స్వయంగా నిర్మిస్తున్న ఈ భారీ చిత్రం థియేట్రికల్ విడుదలకు సిద్ధమవుతోంది.
ఎమోషన్, యాక్షన్, రొమాన్స్, కామెడీ కమర్షియల్ ఎలిమెంట్స్ కూడిన ఈ మాస్ చిత్రానికి కథ, స్క్రీన్‌ప్లే, దర్శకత్వం జెడి-జెర్రీ.తమన్నా భాటియా ఈ సినిమా ట్రైలర్‌ను విడుదల చేశారు.
విదేశాల్లో మైక్రోబయాలజీ డాక్టరేట్ పూర్తి చేసి దేశ ప్రజలకు సేవ చేసేందుకు తన స్వగ్రామానికి వచ్చిన శరవణన్ కు ఇక్కడ ఎలాంటి పరిస్థితులు ఎదురయ్యాయి? సవాళ్ళని ఎలా ఎదురుకున్నాడనేది ‘ది లెజెండ్’ కధాంశంగా ట్రైలర్ చూస్తే అర్ధమౌతుంది.
శరవణన్ కూల్‌గా కనిపిస్తున్నారు.
యాక్షన్, రోమాన్స్, కామెడీ అన్నీ ఎలిమెంట్స్ లో తనదైన ఈజ్ తో ఆకట్టుకున్నారు.జెడి-జెర్రీ ఈ చిత్రాన్ని పూర్తి కమర్షియల్ ఎంటర్‌టైనర్‌గా రూపొందించారనేది ట్రైలర్ చూస్తే అర్ధమౌతుంది.
సినిమాటోగ్రఫీ రిచ్ గా వుంది.హారిస్ జయరాజ్ ట్రైలర్ కు అందించిన నేపధ్య సంగీతం ఆకట్టుకుంది.
నిర్మాణ విలువలు ఉన్నతంగా వున్నాయి.సినిమా అన్ని వర్గాల ప్రేక్షకులకు ఆకట్టుకునేలా వుంది.
ఊర్వశి రౌతేలా ఈ చిత్రంలో కధానాయికగా కనిపించనుంది.లెజెండ్ శరవణన్‌తో కలిసి ‘ది లెజెండ్’లో అన్ని భాషలకు చెందిన ప్రముఖ సాంకేతిక నిపుణులు పని చేశారు.
ప్రముఖ హాస్యనటుడు వివేక్‌కి ఇదే చివరి సినిమా.ప్రముఖ హాస్యనటుడు యోగిబాబు కూడా ఈ చిత్రంలో కీలక పాత్ర పోషిస్తున్నారు.సినిమాలోని ప్రముఖ పాత్రలన్నీ పేరున్న నటీనటులే పోషించారు.హారిస్ జయరాజ్ ఈ చిత్రానికి యూత్ ఫుల్ ఆల్బమ్ అందించారు.
ఆర్‌వేల్‌రాజ్ సినిమాటోగ్రఫీ, ఎడిటింగ్ రూబెన్, ఎస్‌ఎస్ మూర్తి ఆర్ట్‌వర్క్ అందించారు.పట్టుకోట్టై ప్రభాకర్ డైలాగ్స్ రాయగా, స్టంట్ కొరియోగ్రఫర్ గా అనల్ అరసు, కొరియోగ్రఫీగా రాజు సుందరం, బృందా, దినేష్ మాస్టర్స్ పని చేశారు.
‘ది లెజెండ్’ జులై 28న ప్రపంచ వ్యాప్తంగా తమిళం, తెలుగు, కన్నడ, మలయాళం, హిందీ భాషల్లో గ్రాండ్‌గా విడుదల కానుంది.శ్రీ లక్ష్మీ మూవీస్ సంస్థ తిరుపతి ప్రసాద్ ఈ చిత్రాన్ని తెలుగు రాష్ట్రాల్లో విడుదల చేయనున్నారు.
తారాగణం: లెజెండ్ శరవణన్, ఊర్వశి రౌటేలా, వివేక్, యోగి బాబు, విజయకుమార్, ప్రభు, నాజర్, సుమన్, తంబి రామయ్య, రోబో శంకర్, మయిల్‌సామి, హరీష్ పారెడ్డి, మునిస్కాంత్, మన్సూర్ అలీ ఖాన్, రాహుల్ తదితరులు.