ఆఫ్ఘనిస్తాన్ పేరు చెబితే తాలిబన్లు గుర్తుకొస్తున్నారు.త్వరలో జరగబోయే టి-20 ప్రపంచకప్ ఆఫ్ఘనిస్తాన్ క్రికెట్ జట్టు ఆడుతుందా లేదా అన్న ప్రశ్నార్థకంగా మారిన తరుణంలో తాలిబాన్లు కీలక ప్రకటన చేశారు.
తాలిబాన్లు క్రికెట్ కు మద్దతు ప్రకటించారు.దీంతో యూఏఈ వేదికగా జరిగే టీ20 ప్రపంచ కప్పు లో ఆఫ్ఘనిస్తాన్ జట్టు పాల్గొనేందుకు స్పష్టమయింది.
ఆఫ్ఘనిస్తాన్ క్రికెట్ వర్గాలతో సమావేశమైన తాలిబన్ నాయకుడు అనీస్ హక్కానీ వారికి భరోసా కల్పించాడు.ఈ సమావేశంలో ఆఫ్ఘనిస్తాన్ కెప్టెన్ హస్మతుల్లా షాహిద్, క్రికెట్ బోర్డు మాజీ అధికారులు నూర్ అలీ జద్రాన్, అసదుల్లా ఉన్నట్లు సమాచారం.
ఎటువంటి భయాందోళనకు గురి కావాల్సిన అవసరం లేదని ధైర్యంగా క్రికెట్ ఆడాలని ఆఫ్ఘనిస్తాన్ జట్టుకు తాలిబన్లు సూచించినట్లు తెలుస్తోంది.సమస్యలను త్వరలోనే పరిష్కరిస్తామని 1996-2001 మధ్య హక్కానీ అధ్యక్షతనే క్రికెట్ ప్రారంభమైంది.
తాలిబాన్ల ప్రకటనలతో ఐసీసీ టీ20 ప్రపంచకప్ లో ఆడనిస్తారా.