వార్ రూమ్ @ ఢిల్లీ

తెలంగాణ రాజకీయాల్లో( Telangana politics ) కాస్త వెనకబడినట్టుగా కనిపిస్తున్న భాజపా సరికొత్త నిర్ణయాలు తీసుకున్నట్లుగా తెలుస్తుంది.తెలంగాణ లో నాయకత్వ మార్పు కలిగించిన కుదుపుల నుంచి ఇప్పుడిప్పుడే సర్దు కుంటున్న కాషాయ పార్టీ ఇప్పటికే మిషన్- 75( Mission- 75 ) పేరుతో ఆపరేషన్ ఆకర్ష స్టార్ట్ చేసింది.

 Bjp War Room At Delhi , Telangana Politics, Delhi , Bjp, Mission- 75, Kishan Red-TeluguStop.com

గతవారం రాష్ట్ర బిజెపి అధ్యక్షుడు కిషన్ రెడ్డి ( Kishan Reddy )నివాసం లో కేంద్ర హోమ్ మంత్రి అధ్యక్షతన జరిగిన ప్రత్యేక సమావేశానికి రాష్ట్రస్థాయి, జాతీయ స్థాయి బాజాపా నాయకులు పాల్గొన్నారు.ఇక్కడ తీసుకుంటున్న నిర్ణయాలు రాష్ట్ర ప్రభుత్వానికి లీక్ అవుతున్న అనుమానాల మధ్య ఇకపై ఢిల్లీ కేంద్రంగా వార్ రూమ్ ఏర్పాటు చేయాలనే నిర్ణయానికి వచ్చినట్టుగా తెలుస్తుంది.

Telugu Amit Shah, Assembly, Bjp War Delhi, Delhi, Kishan Reddy, Telangana, War-T

ఇక పై కీలక నిర్ణయాలన్ని వార్ రూమ్( War room ) వేదికగానే తీసుకోవాలని మీడియాతో మాట్లాడేటప్పుడు కూడాపార్టీ లోకి వలసలపై పై లీకులు ఇవ్వాలే తప్ప పార్టీలోకి చేరే వారి ఇన్ఫర్మేషన్ ఎట్టి పరిస్థితుల్లోనూ చివరి నిమిషం వరకు సీక్రెట్ గా ఉండాలని అమిత్ షా ( Amit Shah )గట్టిగా చెప్పినట్లు సమాచారం అంతేకాకుండా ఇకపై సమన్వయం లేకుండా ఎవరికి వారు మీడియా ముందు మాట్లాడితే చూస్తూ ఊరుకోమని కూడా హెచ్చరించినట్లు తెలిసింది.

Telugu Amit Shah, Assembly, Bjp War Delhi, Delhi, Kishan Reddy, Telangana, War-T

బిజెపి అధ్యక్షుడు కిషన్ రెడ్డి కూడా నిర్ణయాలన్నీ ఢిల్లీ వేదికగా తీసుకుంటే కీలకమైన నిర్ణయాలు తీసుకోవడం సులువుతుందని అంతేకాకుండా రాష్ట్రంలో లీకులు అరికట్టినట్లు కూడా అవుతుందని నేతలకు తేల్చి చెప్పినట్టు సమాచారం .వచ్చే కొన్ని రోజుల్లో తెలంగాణ భాజపాల్లోకి కీలక స్థాయి నేతలు జంప్ చేయబోతున్నట్లు వార్తలు వస్తున్నదరిమి లా మరో మారు బారాసాకు ప్రత్యామ్నాయంగా భాజపా ముందుకు దూసుకు వచ్చే అవకాశం కనిపిస్తుందట .తీసుకుంటున్న ప్రత్యేక చర్యలతో రాష్ట్ర భాజపా నాయకులలోను భాజపా కార్యకర్తల్లోనూ సరికొత్త జోష్ వస్తుందని అసెంబ్లీ ఎన్నికలకు ఘనంగా సిద్ధమవుతామంటూ కాషాయనేతలు ప్రకటిస్తున్నారు మరి డిల్లీ సర్దుబాట్లు తెలంగాణ బాజాపా పరిస్థితి ని ఏమేరకు చక్కదిద్దుతాయో చూడాలి .

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube