స‌హాయం అడిగిన వెంట‌నే స్పందించే మంత్రి ఆమె... సుష్మా స్వ‌రాజ్ క‌హానీ!

మన దేశంలో ప్ర‌జాభిమానం పొందిన‌ రాజకీయ నాయకులు చాలా మంది ఉన్నారు.వారు తమ పన‌త‌నం, నిజాయితీల‌తో ఎల్లప్పుడూ అంద‌రి త‌ల‌లో నాలుక‌గా మారుతారు.

 Sushma Swaraj Is A Cabinet Minister For 25 Years , Sushma Swaraj ,cabinet Minis-TeluguStop.com

వారిలో దివంగ‌త మాజీ విదేశాంగ మంత్రి సుష్మా స్వరాజ్ కూడా ఒకరు.విదేశాల్లో ఆపదలో ఉన్న అనేక మంది భారతీయులకు సహాయ హస్తం అందించడంతోపాటు నరేంద్ర మోదీ ప్రభుత్వ తొలి పర్యాయం హయాంలో అత్యంత అందుబాటులో ఉన్న మంత్రిగా సుష్మా స్వరాజ్ ఎప్పటికీ అంద‌రికీ గుర్తుండిపోతారు.

ఇందిరా గాంధీ ప్రధానమంత్రి పదవితో పాటు అదనపు మంత్రిత్వ శాఖను కూడా నిర్వహించారు.అయితే సుష్మా స్వరాజ్ భారతదేశానికి మొదటి పూర్తికాల మహిళా విదేశాంగ మంత్రి.

సుష్మా స్వరాజ్ 2019లో గుండెపోటుతో మరణించారు.ఆమె మరణం ఒక్క రాజకీయాల్లోనే కాకుండా యావత్ దేశ వ్యాప్తంగా సంచలనం సృష్టించింది.తమ అభిమాన మంత్రి ఇక లేరంటే ప్రజలు నమ్మలేకపోయారు.

25 ఏళ్లకే క్యాబినెట్ మంత్రి సుష్మా స్వరాజ్ 1977లో హర్యానా శాసనసభలో ప్రవేశించి, 25 ఏళ్ల వయసులో రాష్ట్ర మంత్రివర్గంలో మంత్రి అయ్యారు.ఆమె ఢిల్లీ మాజీ ముఖ్యమంత్రి, మోడీ ప్రభుత్వం మినహా కేంద్రంలోని ప్రతి బిజెపి ప్రభుత్వంలో భాగమైంది.1999లో కర్నాటకలోని బళ్లారి నుంచి అప్పటి కాంగ్రెస్ అధ్యక్షురాలు సోనియా గాంధీకి ఆమె చేసిన ఎన్నికల సవాల్ 1990లలో అత్యంత చర్చనీయాంశమైన ఎన్నికల పోరాటాలలో ఒకటి.

Telugu Bihari Vajpayee, Sushma Swaraj, Indira Gandhi, Narendra Modi, Sonia Gandh

ఆ ఎన్నికల్లో సోనియా గాంధీ 56,000 ఓట్లతో విజయం సాధించారు.1998 నుండి 2004 వరకు అటల్ బిహారీ వాజ్‌పేయి నేతృత్వంలోని బిజెపి ప్రభుత్వంలో సమాచార మరియు ప్రసార శాఖ మంత్రిగా అలాగే ఆరోగ్య మంత్రిగా పనిచేశారు.ఆమె 2009లో మధ్యప్రదేశ్‌లోని విదిశా లోక్‌సభ నియోజకవర్గం నుంచి 15వ లోక్‌సభ ఎన్నికల్లో గెలిచి సుష్మా ఉత్త‌మ నాయ‌కురాలిగా ఎదిగారు.

Telugu Bihari Vajpayee, Sushma Swaraj, Indira Gandhi, Narendra Modi, Sonia Gandh

విజయవంతమైన విదేశాంగ మంత్రి ఆమె విదేశీ వ్యవహారాల మంత్రిగా ఉన్న సమయంలో సామాన్యులకు అత్యంత అందుబాటులో ఉండే మంత్రిగా పేరు పొందారు.విదేశాలలో పాస్‌పోర్ట్ పోయిన సమస్య అయినా లేదా పాస్‌పోర్ట్ సంబంధిత సమస్య అయినా సామాన్యులు చురుకుగా ఆమె సహాయాన్ని కోరేవారు.సుష్మా స్వరాజ్ స్వయంగా ముందుకు వ‌చ్చి ప్రజలకు సహాయం చేయడం విశేషం.2015 సంవత్సరంలో నేహా పరీక్ అనే పౌరురాలు యూరప్ ట్రిప్ నుండి తిరిగి వస్తుండగా ఇస్తాంబుల్‌లో చిక్కుకుపోయిన తన తల్లిదండ్రుల కోసం సహాయం కోరింది.ఆ స‌మ‌యంలో నేహా తల్లి పాస్‌పోర్ట్ పోగొట్టుకుంది.

నేహా సమస్య తెలుసుకున్న సుష్మా స్వరాజ్ వెంటనే ఆమెకు సహాయం చేశారు.భారతీయులకే కాదు విదేశీయులకు కూడా సుష్మా స్వరాజ్ సాయం చేశారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube