అమరావతి ఆర్ -5 జోన్ కేసుపై సుప్రీంకోర్టులో విచారణ జరిగింది.ఆర్ -5 జోన్ లో ఇళ్ల నిర్మాణాలను నిలిపివేయాలంటూ రాష్ట్ర హైకోర్టు ఇచ్చిన మధ్యంతర ఉత్తర్వులను ఏపీ ప్రభుత్వం సుప్రీంకోర్టులో సవాల్ చేసిన విషయం తెలిసిందే.
ఈ క్రమంలో హైకోర్టు ఆర్డర్ పై స్టే ఇచ్చేందుకు సుప్రీం ధర్మాసనం నిరాకరించింది.అనంతరం ప్రతివాదులకు అత్యున్నత న్యాయస్థానం నోటీసులు జారీ చేసింది.
అదేవిధంగా ప్రతి వాదులకు కౌంటర్ దాఖలు చేసేందుకు కోర్టు మూడు వారాల గడువు ఇచ్చింది.అనంతరం తదుపరి విచారణను ధర్మాసనం నవంబర్ 5 కి వాయిదా వేసింది.