SAFF ఛాంపియన్షిప్ టైటిల్ గెలిచిన భారత్.. సునీల్ ఛెత్రీ పై ప్రశంసల వర్షం..!

తాజాగా బెంగళూరు కంఠీరవం స్టేడియంలో భారత్- కువైట్( India vs Kuwait ) మధ్య జరిగిన ఫైనల్ మ్యాచ్లో భారత్ ఘన విజయం సాధించి టైటిల్ సొంతం చేసుకుంది.భారత ఫుట్ బాల్ జట్టు ను ( Indian Football Team ) తొమ్మిదవ సారి శాప్ టోర్నమెంట్ విజేతగా నిలబెట్టడంలో సునీల్ ఛెత్రీ( Sunil Chhetri ) కీలక పాత్ర పోషించాడు.

 Sunil Chhetri Credits Youngsters In Indian Team For Saff Championship Triumph-TeluguStop.com

ప్రస్తుతం సునీల్ ఛెత్రీపై అందరు ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు.రెండు దశాబ్దాలుగా భారత ఫుట్ బాల్ జట్టు విజయాలు సాధించడంలో కీలక పాత్ర పోషించాడు.

భారత జట్టు తరఫున అత్యధిక గోల్స్ చేసిన ఆటగాడిగా తనకంటూ ఓ సరికొత్త రికార్డు క్రియేట్ చేసుకున్నాడు.

సునీల్ ఛెత్రీ కెరియర్ చూసుకుంటే ఇప్పటివరకు 140 అంతర్జాతీయ మ్యాచులు ఆడి, 92 గోల్స్ కొట్టాడు.

దీంతో భారత్ తరపున అత్యధిక గోల్స్ చేసిన ఆటగాడిగా గుర్తింపు పొందాడు.అంతర్జాతీయ స్థాయిలో అత్యధిక గోల్స్ చేసి, యాక్టివ్ ఆటగాళ్లలో మూడవ స్థానంలో నిలిచాడు.మొత్తంగా చూసుకుంటే అత్యధిక గోల్స్ కొట్టిన ఆటగాళ్ల జాబితాలో నాలుగో స్థానంలో సునీల్ ఛెత్రీ ఉన్నాడు.

Telugu Footballsunil, India, India Kuwait, Indian Football, Sunil Chhetri-Sports

సునీల్ ఛెత్రీ 2002 లో మోహున్ భగవన్ తో జరిగిన మ్యాచ్ ద్వారా ఫుట్ బాల్ ఆటలోకి ఆరంగేట్రం చేశాడు.అంతర్జాతీయ స్థాయిలో 2005లో మొదటి గోల్ నమోదు చేశాడు.ఇదే 2005 సంవత్సరంలో పాకిస్తాన్ పై( Pakistan ) మొదటి గోల్ కొట్టి రికార్డ్ సృష్టించాడు.2011లో న్యూఢిల్లీలో జరిగిన శాప్ ఛాంపియన్షిప్ లో( SAFF Championship ) ఏకంగా ఏడు గోల్స్ చేసి భారత జట్టుకు విజయం అందించాడు.

Telugu Footballsunil, India, India Kuwait, Indian Football, Sunil Chhetri-Sports

2007,2009,2012 లలో నెహ్రూ కప్ సాధించడంలో కీలక పాత్ర పోషించాడు.2011, 2015, 2021 లలో దక్షిణాసియా ఫుట్బాల్ సమాఖ్య ఛాంపియన్ షిప్ సాధించడంలో కీలక పాత్ర పోషించాడు. సునీల్ ఛెత్రీ ఇలాంటి ఎన్నో విజయాలు భారత జట్టు సాధించడంలో కీలక పాత్ర పోషిస్తూ తన పేరిట ఎన్నో రికార్డులను నమోదు చేసుకుంటూ అందరి ప్రశంసలు పొందుతున్నాడు.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube