ప్రస్తుతం తెలంగాణలో ఎన్నికల కోలహాలం మొదలైంది.ఇక ఎన్నికల కోడ్ పడడంతో చాలామంది పోలీసులు రోడ్డుపై కాస్త అనుమానం వచ్చినా కూడా వెహికల్ ని చెక్ చేస్తూ ఉన్నారు.
ముఖ్యమంత్రి కేసీఆర్ ( KCR ) నుండి ఎమ్మెల్యే అభ్యర్థులు మిగతా కార్యకర్తలు ఇలా ఎవరి మీద అనుమానం వస్తే వారి కార్లలో చెకింగ్ లు చేస్తున్నారు.అలాగే చాలామంది పెద్దపెద్దవారి ఇళ్లలో కూడా ఐటీ సోదాలు నిర్వహిస్తున్నారు.
ఇక ఎన్నికల వేళ కార్లో మద్యం కనిపించినా లేదా నోట్ల కట్టలు కనిపించినా కూడా వాళ్ళు జైలుకే వెళతారు.ఇక పని మీద ఎక్కడికి వెళ్ళినా సరే కార్లో లేదా బండిపై వెళ్లేటప్పుడు డబ్బులు, మద్యం సీసాలు తీసుకొని వెళ్లడానికి భయపడుతున్నారు జనాలు.
అయితే తాజాగా పోలీస్ రైడింగ్ లో అడ్డంగా దొరికిపోయారు యాంకర్ సుమ ( Anchor Suma ) కొడుకు రోషన్.సుమా కొడుకు రోషన్ బబుల్గం అనే సినిమాతో హీరోగా మన ముందుకు రావడానికి సిద్ధంగా ఉన్నారు.అయితే తాజాగా ఆయన తన ఫ్రెండ్స్ తో కలిసి కారులో వెళ్తుండగా అనుమానం వచ్చి పోలీసులు ఆ కారుని ఆపారు.అయితే కారు దిగిన రోషన్ ( Roshan ) ఆయన ఫ్రెండ్స్ అందరూ తిక్క తిక్క సమాధానాలు చెప్పడంతో పోలీసులలో మరింత అనుమానం వచ్చి కారులో తనిఖీలు చేయడం మొదలుపెట్టారు.
ఇక కారు డిక్కీ ఓపెన్ చేసి చూడగా అందులో కొన్ని సూట్ కేసులు ఉన్నాయి.అయితే ఆ సూట్ కేసులో ఏమున్నాయో తెలిస్తే మీరందరూ షాక్ అవ్వాల్సిందే.ఇక ఇంతకీ ఆ సూట్ కేసుల్లో ఏమున్నాయి అంటే బబుల్గమ్ ( Babulgum ) అలాగే జిలేబి.ఇక ఇప్పటికే మీ అందరికీ ఈ విషయం చెప్పడంతో అర్థం అయిపోయి ఉంటుంది.
అదేంటంటే రోషన్ తన సినిమా బబుల్గం ప్రమోషన్ కోసం ఇలా కొత్తరకంగా ప్రమోషన్ ని నిర్వహించారు.ఇక దీనికి సంబంధించిన వీడియో ప్రస్తుతం నెట్టింట చక్కర్లు కొడుతుంది.
అయితే అప్పట్లో సుమ కూడా ఉగ్రం ( Ugram ) సినిమా ప్రమోషన్స్ కోసం కారులో బేడీలు వేసుకొని కూర్చున్న వీడియోలు ఫోటోలు నెట్టింట్లో చక్కర్లు కొట్టిన సంగతి మనకు తెలిసిందే.ప్రస్తుతం రోషన్ కి సంబంధించిన ఈ వీడియో సోషల్ మీడియాలో తెగ వైరల్ గా మారింది.