ఎన్నికల ప్రచారంలో భాగంగా ఆదిలాబాద్ లో బీఆర్ఎస్ ప్రజా ఆశీర్వాద సభలో సీఎం కేసీఆర్ పాల్గొన్నారు.ప్రజాస్వామ్యంలో రావాల్సినంత పరిణితి రాలేదని తెలిపారు.
ఎన్నికల్లో ప్రజల గెలుపే నిజమైన ప్రజాస్వామ్యం అని కేసీఆర్ పేర్కొన్నారు.అభ్యర్థి, పార్టీల చరిత్ర ఏంటో చూడాలని తెలిపారు.
ఈ క్రమంలో ప్రజలు అన్నీ ఆలోచించి ఓటు వేయాలన్నారు.రైతుబంధు దుబారా అని కాంగ్రెస్ నేతలు అంటున్నారని మండిపడ్డారు.
కాంగ్రెస్ ప్రభుత్వం వస్తే ధరణిని తీసేస్తారట అన్న కేసీఆర్ ధరణి పోతే మళ్లీ పైరవీకారులు, దళారులు వస్తారని తెలిపారు.ఈ క్రమంలోనే 24 గంటల కరెంట్ కావాలా? కాంగ్రెస్ కావాలా? అనేది ఆలోచించుకోవాలని సూచించారు.