రన్నింగ్ ఆటోలో యువకుడు స్టంట్స్.. మరొకరి ప్రాణం మీదకు తెచ్చింది!

సోషల్ మీడియా( Social media )లో బాగా ఫేమస్ అయ్యేందుకు ఇటీవల కాలంలో యువతీయువకులు రోడ్లపై స్టంట్లు చేస్తున్నారు.యువత నడిరోడ్డుపై చేసే ప్రమాదకర స్టంట్స్ ఒక్కోసారి అవి ప్రాణాల మీదకు తెస్తున్నాయి.

 Stunts Of A Young Man In A Running Auto.. Brought Another's Life! Running Autio,-TeluguStop.com

వారు తమ ప్రాణాలతో పాటు ఇతరుల ప్రాణాలను కూడా ప్రమాదంలోకి నెడుతున్నారు.తాజాగా అలాంటి ఓ ఘటన ఢిల్లీలో జరిగింది.

నిత్యం వచ్చీపోయే వాహనాలతో రద్దీగా ఉండే సిగ్నేచర్ బ్రిడ్జిపై ఓ యువకుడు మద్యం మత్తులో స్టంట్స్ చేశాడు.

ఆటో( Autio ) నుంచి బయటకు వేలాడుతూ చాలా స్టైల్‌గా స్టంట్స్ చేశాడు.దానిని వెనుక బైక్‌( Bike )పై వెళ్తున్న వారు వీడియో తీశారు.ఆ సమయంలో ఊహించని ఘటన జరిగింది.

మరో వ్యక్తి రోడ్డుపై పడిపోయాడు.ఇలా మరో వ్యక్తి ప్రమాదానికి గురయ్యేలా ఆ యువకుడు చేశాడు.

ఈ ఘటనకు సంబంధించిన విషయాలు ఇలా ఉన్నాయి.

నిత్యం సోషల్ మీడియా మనం చూస్తుంటాం.అయితే అందులో ఫేమస్ అయ్యిన వారిని అనుకరించాలని చాలా మంది భావిస్తున్నారు.కొందరు ఇలాగే బైక్‌లు, కార్లపై విన్యాసాలు చేస్తూ, ఆ వీడియోలను సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తున్నారు.

ఇదే కోవలో ఢిల్లీ( Delhi )లో కొందరు ప్రయత్నించారు.ఓ యువకుడు ఆటోలో వేలాడుతూ వీడియోలు తీసుకున్నాడు.

అయితే మద్యం మత్తులో అతడు ఇలా చేసినట్లు తెలుస్తోంది.ఇటీవల కాలంలో ఢిల్లీ సిగ్నేచర్ బ్రిడ్జి ప్రాంతంలో ఇలాంటి ఘటనలు జరుగుతున్నాయి.

ఈ క్రమంలో ఆటోకు వేలాడుతూ అతడు ముందుకు వెళ్తుండగా సైకిల్‌పై వెళ్తున్న ఓ వ్యక్తికి అతడి చేయి తగిలింది.దీంతో సైకిల్‌పై వెళ్తున్న ఆ వ్యక్తి కిందపడ్డాడు.

దీంతో కిందపడ్డ ఆ వ్యక్తి గాయాలపాలయ్యాడు.దీంతో వాహనదారులు కొందరు తమ వాహనాలను నిలిపి వేసి ఆ వ్యక్తి వద్దకు వెళ్లారు.

కింద పడ్డ వ్యక్తిని పైకి లేపి సాయం అందించారు.అదృష్టవశాత్తూ చిన్న పాటి గాయాలతో ఆ వ్యక్తి తప్పించుకున్నాడు.

అయితే ఇలా వీడియోలు చేస్తూ ఇతరుల ప్రాణాలకు ప్రమాదంలో నెడుతున్నారని నెటిజన్లు మండిపడుతున్నారు.దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

ఇలా రోడ్లపై నిర్లక్ష్యంగా వ్యవహరించే వారు, వీడియోలు తీసే వారిని అరికట్టాలని నెటిజన్లు కోరుతున్నారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube