కిడ్నాపర్ల నుంచి బాలికను కాపాడింది.. కుక్కపై ప్రశంసల వెల్లువ

కుక్కలను మనుషులకు బెస్ట్ ఫ్రెండ్ అని పిలుస్తారు.కుక్కలు( Dogs ) విశ్వాసానికి మారు పేరు అని అంటారు.

 Street Dog Saves School Girl From Getting Kidnapped Details, Dog, Kidnapped, Kid-TeluguStop.com

వాటికి బిస్కెట్లు వేసినా, కాసింత అన్నం పెట్టినా అవి చాలా విశ్వాసం చూపిస్తాయి.ఒక్కోసారి తోక ఊపుకుంటూ అన్నం పెట్టిన వారి వెంట వచ్చేస్తాయి.

ఇక ఇంట్లో పెంపుడు కుక్కలు అయితే కుటుంబ సభ్యుల్లో ఒకరిగా కలిసి పోతాయి.యజమానులకు చాలా పనుల్లో సాయపడుతాయి.

అంతేకాకుండా ఇంట్లో దొంగలు పడితే వారికి చుక్కలు చూపిస్తాయి.ఇదే కోవలో ఓ కుక్క తన ప్రాణాలను పణంగా పెట్టి కిడ్నాపర్లతో( Kidnapers ) పోరాడింది.

ఓ బాలికను వారు ఎత్తుకుపోతుండగా వారిపై దాడి చేసింది.అలా బాలికను కుక్క కిడ్నాపర్ల నుంచి కాపాడింది.

దీనికి సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.దీంతో ఆ కుక్క పై నెటిజన్లు ప్రశంసలు కురిపిస్తున్నారు.ఈ ఘటనకు సంబంధించిన ఆసక్తికర విషయాలిలా ఉన్నాయి.ఇంట్లో కుక్కలను పెంచుకోవడం వల్ల అనేక ప్రయోజనాలు ఉన్నాయి.యజమానుల భద్రతను( Owners Safety ) కాపాడటమే కాకుండా మనకు ఇంట్లో ఒక మనిషిలా కలిసి పోయి ఎంతో ప్రేమగా ఉంటాయి.అయితే, వీధి కుక్క నుండి ఈ ప్రయోజనాలన్నీ ఆశించలేము.

కానీ వీధి కుక్కలు సైతం ఎంతో విశ్వాసాన్ని కనబరుస్తాయి.వాటికి కొంచెం ఆహారం పెట్టినా చాలా విశ్వాసాన్ని చూపుతుంటాయి.

ఇలాంటి ఓ వీధి కుక్క( Stray Dog ) ఓ పాఠశాల విద్యార్థినిని దుండగులు కిడ్నాప్ చేయకుండా కాపాడిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.వీడియోలో పాఠశాల విద్యార్థిని తన వీపున తగిలించుకొనే సామాను సంచితో రోడ్డులో నడుస్తోంది.

ఇంతలో ఆ అమ్మాయి( Girl ) రోడ్డుపక్కన వెళుతుండగా వెనుక నుంచి ఓ కారు వచ్చింది.అకస్మాత్తుగా, అమ్మాయి దగ్గర కారు స్లో అయి, డోర్ తెరుచుకుంటుంది.దీంతో తనకు ఏదో ఆపద వస్తుందని గ్రహించి, వెంటనే వెనక్కి అడుగు వేసింది.కిడ్నాపర్ల ఆమెను తీసుకెళ్లేందుకు యత్నించగా ఆ అమ్మాయి భయపడింది.ఇంతలో ఓ వీధి కుక్క పరుగు పరుగున అక్కడకు వచ్చింది.కారు వైపు దూసుకెళ్లింది.

కిడ్నాపర్లు భయపడి అక్కడి నుంచి వెళ్లిపోయారు.కారు ముందుకు కదిలినా ఆ కుక్క వారిని వెంబడించింది.

సీసీ టీవీ ఇడియట్స్ అనే ట్విట్టర్ ఖాతాలో పోస్ట్ చేసిన ఈ వీడియో నెటిజన్లను ఆకట్టుకుంటోంది.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube