ఈ స్టార్ విలన్ ఏ విధంగా చనిపోయారో తెలిస్తే మాత్రం కన్నీళ్లు పెట్టాల్సిందే!

ప్రతి సంవత్సరంలో వందల సంఖ్యలో విలన్స్ టాలీవుడ్ ఇండస్ట్రీకి పరిచయమవుతూ ఉంటారు.అయితే ఈ విలన్స్ లో గుర్తింపును సంపాదించుకున్న విలన్స్ సంఖ్య చాలా తక్కువ కాగా అలా వాళ్లలో రామిరెడ్డి కూడా ఒకరు.250కు పైగా సినిమాలలో రామిరెడ్డి నటించి ప్రేక్షకులను ఎంతగానో మెప్పించడం గమనార్హం.అంకుశం సినిమాతో విలన్ గా కెరీర్ ను మొదలుపెట్టిన రామిరెడ్డి ఆ సినిమాలో అద్భుతమైన నటనతో మెప్పించారు.

 Star Villain Ramireddy Last Days Struggles And Death Reasons Details, Ramireddy,-TeluguStop.com

ఆ తర్వాత మెయిన్ విలన్ గా చాలా సినిమాలలో అవకాశాలు రాగా ఆ అవకాశాలు రామిరెడ్డి కెరీర్ కు ఎంతగానో ప్లస్ అయ్యాయి.కొన్ని సినిమాలలో వెరైటీ రోల్స్ లో రామిరెడ్డి నటించారు.కిడ్నీ సంబంధిత వ్యాధులతో కొంతకాలం బాధ పడిన రామిరెడ్డి 2011 సంవత్సరం ఏప్రిల్ 14వ తేదీన మృతి చెందారు.55 సంవత్సరాల వయస్సులో ఈయన మృతి చెందగా కిడ్నీ సమస్య వల్ల ఆయన ఎంతో టార్చర్ అనుభవించారని తెలుస్తోంది.

ఆ సమయంలో ఆయన బరువు కూడా తగ్గడంతో చాలామంది ఆయనను గుర్తుపట్టలేకపోయారు.రామిరెడ్డి మరణంతో టాలీవుడ్ ఇండస్ట్రీ ఒక గొప్ప నటుడిని కోల్పోయిందనే చెప్పాలి.రామిరెడ్డి పలు వివాదాల ద్వారా కూడా కొన్ని సందర్భాల్లో వార్తల్లో నిలవడం గమనార్హం.రామిరెడ్డి మరణించినా ఆయన సినిమాల ద్వారా మాత్రం ఫ్యాన్స్ హృదయాల్లో బ్రతికే ఉన్నారని చెప్పాలి.

రామిరెడ్డి తన నటనతో ఎన్నో అవార్డులను సొంతం చేసుకున్నారు.పలు పత్రికల్లలో రామిరెడ్డి జర్నలిస్ట్ గా పని చేశారు.రామిరెడ్డి చివరిరోజుల్లో అనారోగ్య సమస్యల వల్ల ఎన్నో ఇబ్బందులు పడ్డారని తెలుస్తోంది.రామిరెడ్డి వరుస ఆఫర్లతో బిజీగా ఉన్న సమయంలో భారీ స్థాయిలో రెమ్యునరేషన్ ను తీసుకున్నారని సమాచారం అందుతోంది.

రామిరెడ్డి తరహాలో మంచి గుర్తింపును సంపాదించుకున్న విలన్స్ చాలా తక్కువమంది ఉన్నారని చెప్పాలి.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube