సాధారణంగా ఇతర రంగాలతో పోల్చి చూస్తే సినిమా నిర్మాణ రంగంలో సక్సెస్ రేట్ తక్కువనే సంగతి తెలిసిందే.నిర్మాతలుగా ఎంట్రీ ఇచ్చి వరుస ఫ్లాపుల వల్ల చాలామంది నిర్మాతలు ఇండస్ట్రీకి దూరం కావాల్సి వచ్చింది.
అయితే దిల్ రాజు మాత్రం ఇండస్ట్రీలో సక్సెస్ ఫుల్ నిర్మాతగా కెరీర్ ను కొనసాగిస్తున్నారు.సినిమాల ద్వారా దిల్ రాజు స్థాయిలో లాభాలను సొంతం చేసుకున్న మరో నిర్మాత అయితే లేరనే చెప్పాలి.
దిల్ రాజు మొదటి భార్య పేరు అనిత అనే సంగతి తెలిసిందే.అయితే దిల్ రాజు అనిత ఒకరినొకరు ప్రేమించుకుని పెళ్లి చేసుకున్నారు.ఒక సందర్భంలో దిల్ రాజు మాట్లాడుతూ దర్శకులు సీన్ ను ఎలా చెయ్యాలో మాత్రమే నేను చెబుతానని అంతే తప్ప ఇలా చెయ్యండి అలా చెయ్యండి అని చెప్పనని ఆయన తెలిపారు.నాకు బాగా నచ్చిన డైరెక్టర్ వాసువర్మ అని అయితే దర్శకుడిగా వాసువర్మ తీసిన సినిమాలు సక్సెస్ కాలేదని తెలిపారు.
వంశీ పైడిపల్లి ఎమోషనల్ గా దగ్గరని అయన చెప్పుకొచ్చారు.
విలేజ్ లోనే పదో తరగతి వరకు చదువుకున్నానని ఆయన తెలిపారు.కాలేజ్ లో బాగా చదువుకుని ఉంటే బాగుండేదని అనిపిస్తుందని ఆయన తెలిపారు.అనిత నేను ప్రేమించుకుని పెళ్లి చేసుకున్నామని మాది 45 రోజుల ప్రేమకథ అని దిల్ రాజు వెల్లడించారు.
మా కజిన్ మ్యారేజ్ లో మొదటిసారి నేను అనితను చూశానని దిల్ రాజు అన్నారు.
కెమెరాకు సెల్స్ కావాలని అనిత నన్ను అడిగిందని ఆ తర్వాత ఒకరికొకరు నచ్చి లవ్ ప్రపోజ్ చేసుకున్నామని ఆ తర్వాత పెద్దలను ఒప్పించి పెళ్లి చేసుకున్నామని దిల్ రాజు తెలిపారు.ఎంగేజ్మెంట్ తర్వాత పది నెలల గ్యాప్ వచ్చిందని ఆ తర్వాత పెళ్లి జరిగిందని దిల్ రాజు చెప్పుకొచ్చారు.దిల్ రాజు వెల్లడించిన విషయాలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.