బిగ్‌బాస్( Bigg Boss ) తో ఫేమ్ తెచ్చుకున్న సోహెల్( Sohel ) హీరోగా, నిర్మాతగా తెరకెక్కిన సినిమా ‘బూట్‌కట్ బాలరాజు ’( BootCut Balaraju ).మేఘలేఖ( Meghalekha ) హీరోయిన్గా నటించిన ఈ సినిమాలో సునీల్, ముక్కు అవినాష్ , సిరి హనుమంత్, ఇంద్రజ వంటి తదితరులు కీలక పాత్రలలో నటించారు.
శ్రీనివాస్ కోనేటి దర్శకత్వంలో తెరికెక్కిన ఈ సినిమాకు సోహెల్ స్వయంగా నిర్మాతగా మారి ఈ సినిమాను ప్రేక్షకుల ముందుకు తీసుకోవచ్చారు.ఈ సినిమా ఫిబ్రవరి రెండో తేదీ ప్రేక్షకుల ముందుకు వచ్చింది మరి బూట్ కట్ బాలరాజు సినిమా కథ ఏంటి అనే విషయానికి వస్తే.
కథ:
మొదట గతంలో.పటేలమ్మ(ఇంద్రజ)( Indraja ) తండ్రి(సుమన్)కి( Suman ) ఇచ్చిన మాట కోసం భర్తని కూడా వదిలేసి ఊరిపెద్దగా మారుతుంది.
పటేలమ్మ కూతురు మహాలక్ష్మిని(మేఘలేఖ) చిన్నప్పట్నుంచి అందరూ గౌరవిస్తారు కానీ ఆమె వద్దకు మాత్రం ఎవరు రావడానికి ఇష్టపడరు.స్కూల్ లో కూడా అదే పరిస్థితి.ఆ సమయంలో బాలరాజు(సోహెల్)( Balaraju ) మహాలక్ష్మిని కూడా అందరిలాగే ట్రీట్ చేయడంతో మహాలక్ష్మి బాలరాజుతో ఫ్రెండ్షిప్ చేస్తుంది.అక్కడ్నుంచి ప్రస్తుతానికి కథను తీసుకువస్తారు.
బాలరాజు తన ఫ్రెండ్స్(అవినాష్, సద్దాం).తో లైఫ్ ఎంజాయ్ చేస్తూ, కాలేజీ చదువుకుంటారు.
అదే కాలేజీలో సిరి(సిరి హనుమంతు)( Siri Hanumanthu ) బాలరాజుని ప్రేమిస్తుంది.చిన్నప్పట్నుంచి తనతో పాటు పెరిగిన మహాలక్ష్మి కూడా బాలరాజు ప్రేమలో పడుతుంది.
ఇదే విషయాన్ని సిరి అలాగే మహాలక్ష్మి ఇద్దరు కూడా తమ ప్రేమ విషయాన్ని బాలరాజుకు చెబుతారు.

ఎవరూ లేరు సమయంలో బాలరాజు మహాలక్ష్మి( Mahalakshmi ) ఇంటికి వెళ్తారు.అక్కడ వీరిద్దరు కౌగిలించుకొని ఉండగా అప్పుడే పటేలమ్మ మహాలక్ష్మికి మంచి సంబంధం మాట్లాడి ఇంటికి వచ్చి వారిని చూస్తుంది దాంతో తనని ఊరందరి చేత కొట్టిస్తుంది.ఈ క్రమంలోనే ఇద్దరు మధ్య మాట పెరుగుతుంది.
దీంతో పటేలమ్మ వచ్చే ఎన్నికలలో నువ్వు కనుక సర్పంచ్ అయితే నా కూతురినిచ్చి పెళ్లి చేస్తాను అంటూ చాలెంజ్ విసురుతుంది.మరి ఎలాంటి సపోర్ట్ లేని బాలరాజు ఎన్నికలలో గెలిచారా సర్పంచ్ అయ్యారా మహాలక్ష్మిని పెళ్లి చేసుకున్నారా అనే విషయాలు తెలియాలి అంటే సినిమా చూడాలి.

నటీనటుల నటన:
బిగ్ బాస్ తో మెప్పించిన సోహెల్ ఈ సినిమాలో హైపర్ యాక్టివ్ గా ఉండే కుర్రాడిగా, ఫుల్ కామెడీ చేస్తూ మెప్పించాడు.చివర్లో ఎమోషన్ కూడా పండించాడు సోహెల్.మేఘ లేఖ పల్లెటూరు అమ్మాయి పాత్రలో ఎంతో ఒదిగిపోయి నటించారు.ఇక సిరి కూడా తన పాత్రకు పూర్తిగా న్యాయం చేసింది పటేలమ్మ పాత్రలో ఊరి పెద్దగా ఇంద్రజ కూడా మంచిగా నటించారు.
ముక్కు అవినాష్ సద్దాం వంటి వారందరూ కూడా ఎవరి పాత్రలకు వారు పూర్తిగా న్యాయం చేశారు.

టెక్నికల్:
ఈ సినిమా ద్వారా దర్శకుడు కోనేటి మంచి సక్సెస్ అయ్యారని చెప్పాలి.సినిమా అంతా తెలంగాణలోని ఓ పల్లెటూళ్ళో జరుగుతుంది.పల్లెటూరిలో వాతావరణం కెమెరా విజువల్స్ లో చక్కగా చూపించారు.
బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ పర్వాలేదనిపిస్తుంది.రెండు పాటలు మాత్రం వినడానికి, చూడటానికి బాగుంటాయి.
ఎడిటింగ్ వర్క్ పరవాలేదు నిర్మాణాత్మక విలువలు బాగున్నాయి.

విశ్లేషణ:
డబ్బులేని అబ్బాయి, డబ్బున్నోళ్ల కూతురిని ప్రేమించి ఆమెని దక్కించుకోవడానికి ఏదో ఒక ఛాలెంజ్ చేసి గెలవడం అనేది గతంలో చాలా సినిమాల్లో చూసాము.ఈ బూట్‌కట్ బాలరాజు కూడా ఇంచుమించు అలాంటి సినిమాని అని చెప్పాలి మొదటి ఆఫ్ మొత్తం ప్రేమించుకోవడం సెకండ్ ఆఫ్ మొత్తం చాలెంజ్ విసురుకొని ఆ చాలెంజ్ విసిరి ఆయన సర్పంచ్ అవ్వడానికి ఎలా కష్టపడతారు అనేదానిపై ఆసక్తి కలుగుతుంది.సెకండ్ హాఫ్ లో కూడా మొదట అంతా కామెడీగా( Comedy ) చూపించినా చివర్లో ప్రేమ ఎమోషన్ ని వర్కౌట్ చేశారు.
ప్లస్ పాయింట్స్:
నటీనటుల నటన, కామెడీ సన్నివేశాలు పల్లెటూరి వాతావరణం.
మైనస్ పాయింట్స్:
మ్యూజిక్, అక్కడక్కడ కొన్ని సన్నివేశాలు చూసాం అనే భావన, రొటీన్ కథ.
బాటమ్ లైన్:
బూట్‌కట్ బాలరాజు తన ప్రేమ కోసం ఊరిపెద్దతో ఛాలెంజ్ చేసి ఎలా గెలిచాడు అనే కథని కామెడీ, ఎమోషనల్ గా చూపించారు.ఎలాంటి బోర్ లేకుండా ఒకసారి ఈ సినిమాని చూడొచ్చు.